Google: గూగుల్ బిగ్ షాక్, ప్లే స్టోర్ నుండి తొమ్మిది లక్షల యాప్స్‌ను డిలీట్ చేసేందుకు రెడీ అయిన టెక్ దిగ్గజం, అదే బాటలో ఆపిల్ కంపెనీ
Google Play Store (Photo Credits: IANS)

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్లే స్టోర్‌లోని యాప్స్‌ను అప్‌ చేయాలని లేదంటే వాటిని తొలగిస్తామని హెచ్చరించింది. అయితే, గూగుల్‌ను హెచ్చరించినా యాప్స్‌ డెవలపర్లు పట్టించుకోకపోవడంతో తొమ్మిది లక్షల యాప్స్‌ను (Google to remove nearly 900,000 abandoned apps) తొలగించేందుకు రెడీ అయింది. వినియోగదారుల ప్రైవసీ కోసమే గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకున్నది. ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం.. గూగుల్ యాప్ స్టోర్‌లోని యాప్‌ల సంఖ్యను మూడింట ఒక వంతు తగ్గించనున్నది. ఇంతకు ముందు ఆపిల్‌ సైతం తన ప్లే స్టోర్‌ ( Play Store) నుంచి అదే తరహా యాప్‌లను తొలగించాలని నిర్ణయించింది.

గత రెండేళ్లుగా యాప్స్‌ డెవలపర్లు ఎలాంటి అప్‌డేట్స్‌ చేయకపోవడంతోనే ఈ నిర్ణయానికి వచ్చింది. సెనేట్‌ ప్రకారం.. గూగుల్‌, ఆపిల్‌ తమ వినియోగదారుల ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపడుతున్నాయి. నివేదిక ప్రకారం.. పాత యాప్‌లు ఆండ్రాయిడ్‌, iOSలలో మార్పులు, కొత్త APIలు భద్రతను మెరుగుపరచడానికి కొత్త పద్ధతులను ఉపయోగించుకోవడం లేదు. ఈ కారణంగా, పాత యాప్‌లు భద్రత ఉండదు. మరో వైపు గూగుల్‌ ఇటీవల థర్డ్‌ పార్టీ కాల్‌ రికార్డింగ్‌ యాప్‌లను నిషేధించింది. గత నెలలోనే అన్ని కాల్ రికార్డింగ్ యాప్స్ ప్లే స్టోర్ నుంచి నిషేధం విధిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది.

గూగుల్ సెర్చ్‌లో మీ మొబైల్ నెంబర్ ఉందా? వెంటనే డిలీట్ చేయండి, లేకపోతే మీకే డేంజర్, గూగుల్ స్టోర్ నుంచి మీ పర్సనల్ డీటైల్స్ ఇలా తొలగించండి

ఇందులో భాగంగా ప్లే స్టోర్‌ విధానంలో మార్పులు తీసుకురాగా.. ఈ నెల 11 నుంచి కాల్‌ రికార్డింగ్‌ యాప్స్‌ను బ్యాన్‌ చేసింది. అయితే, ఇన్‌బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో వచ్చే ఫోన్లలో ఎలాంటి మార్పులుండవు. ఆండ్రాయిడ్ యూజర్ల ప్రైవసీని మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఆయా కాల్ రికార్డింగ్ ఫీచర్‌ అప్లికేషన్‌లను నిరోధించేందుకు గూగుల్‌ కఠినమైన చర్యలు చేపట్టింది. ఇకపై ప్లే స్టోర్‌లో రిమోట్ కాల్ ఆడియో రికార్డింగ్‌ వంటి యాప్స్ యాక్సస్ చేసుకోలేరు. ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లతో సహా గూగుల్‌ డెవలపర్ విధానాలను అప్‌డేట్ చేసింది.