HDFC Bank Next-Gen Mobile Banking App (Photo Credits: HDFC Bank)

హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ గంట పాటు క్రాష్ అయ్యింది. దీంతో చాలా మంది అసహనానికి లోను అయ్యారు. యాప్ బగ్ గుర్తించే వరకు నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను రాజీవ్ బెనర్జీ కోరారు. ఎట్టకేలకు సమస్యను పరిషర్కించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి యథావిధిగా మొబైల్ యాప్ సేవలు పనిచేస్తాయని ఆయన అన్నారు.

మొబైల్ యాప్ క్రాష్ (HDFC Bank Mobile App Crash) పై హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధి రాజీవ్ బెనర్జీ దీనిపై ట్విటర్ లో స్పందించారు. "మేము మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాము, ఈ సమస్యను పరిష్కరించిన వెంటనే మీకు అప్‌డేట్ చేస్తాము. అప్పటి వరకు వినియోగదారులు తమ లావాదేవీల కోసం నెట్‌బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోవాలని అభ్యర్థించారు. మీకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము, ధన్యవాదాలు" అని తెలిపారు.

చైనాకు భారీ షాక్ ఇచ్చిన భారతీయులు, గత 12 నెలల్లో 43 శాతం మంది చైనా ఉత్పత్తులు కొనుగోలు చేయలేదని సర్వేలో వెల్లడి, గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనా వస్తువుల బహిష్కరణపై ఊపందుకున్న ఉద్యమం

హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ వాడటానికి ప్రయత్నించినప్పుడు బ్యాంక్ వినియోగదారులకు స్క్రీన్‌పై ఒక మెసేజ్ ఫ్లాష్ అయినట్లు చూపిస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై ట్విటర్ వేదికగా బ్యాంక్ అధికారులకు పిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో సమస్య తలెత్తింది. కొంత మంది ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు వారు తెలిపారు. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది దాని గురించి పూర్తిగా తెలియదు.