HMD Global launches Nokia 5.3, C3, Nokia 125, 150 series in India (photo-Twitter)

హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా భారత మార్కెట్లో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లు (Nokia Phones Launched) విడుదల చేసింది బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3, అలాగే ఎంట్రీ లెవల్ నోకియా సీ 3, దీంతో పాటు రెండు ఫీచర్ ఫోన్‌లు నోకియా 125, నోకియా 150 లను ఆవిష్కరించింది. కాగా 5.1కి కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో లాంచ్ చేసింది.ఇందులో నోకియా సీ3ని ఇండియాలొ తొలిసారి లాంచ్ చేసింది.

నోకియా 5.3 ధర, ఫీచర్లు (Nokia 5.3 Price,Features)

నోకియా 5.3 యొక్క 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 13,999 రూపాయలు కాగా, 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ .15,499. ఈ నోకియా హ్యాండ్‌సెట్ సియాన్, ఇసుక మరియు బొగ్గు రంగులో వస్తుంది. దీని అమ్మకం సెప్టెంబర్ 1 నుండి దేశంలో ప్రారంభమవుతుంది. ఆగస్టు 25 నుండి ఈ రోజు వరకు ఫోన్ కోసం ప్రీ-బుకింగ్ చేయవచ్చు.

ఆఫర్ల విషయానికి వస్తే.. రూ .349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌పై రిలయన్స్ జియో నుంచి రూ .4 వేల విలువైన ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది. ఇందులో 2,000 రూపాయల క్యాష్‌బ్యాక్ , 2,000 రూపాయల విలువైన వోచర్‌లు ఉన్నాయి.

6.55-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

5.3 స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌

4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్

6 జీబీ ర్యామ్ , 64 జీబీ స్టోరేజ్

13+ 5+2 +2ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా

8 ఎంపీ సెల్ఫీ కెమెరా

4000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ

మొబైల్ యూజర్లకు భారీ షాక్, త్వరలో మోగనున్న మొబైల్ ఛార్జీల ధరలు, రాబోయే ఆరు నెలల్లో డేటా ధరలు పెరుగుతాయని తెలిపిన భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్

నోకియా సి 3 ధర, ఫీచర్లు (Nokia C3 Price,Features)

నోకియా సి 3 యొక్క 2 జిబి ర్యామ్ మరియు 16 జిబి స్టోరేజ్ రూ .7,499 కు ప్రారంభించగా, 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ వేరియంట్ రూ .8,999 కు విడుదల చేయబడింది. నోకియా సి 3 నార్డిక్ బ్లూ మరియు ఇసుక రంగులో వస్తుంది. దీని అమ్మకం సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమవుతుంది. ఫోన్ ప్రీ-బుకింగ్ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమవుతుంది.

5.99అంగుళాల డిస్‌ప్లే

720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్

ఆండ్రాయిడ్ 10

2 జీబీ/3 జీబీ ర్యామ్, 16 జీబీ/32 జీబీ స్టోరేజ్

128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ

5 ఎంపీ సెల్ఫీ కెమెరా

3.5 మిమీ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో

3040 ఎంఏహెచ్ బ్యాటరీ

రూ.400 ఒక్కసారి ఖర్చు పెడితే 56 రోజులు వరకు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు, అపరిమిత కాల్స్, 1.5 జీబీ రోజువారీ డేటా.. ఈ ప్లాన్లలో మీకు నచ్చిన ప్లాన్ సెలక్ట్ చేసుకోండి

నోకియా 125, నోకియా 150(2020) ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లూ మేలోనే గ్లోబల్ లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లలోనూ పాత బార్ డిజైన్, చిన్న స్క్రీన్, ఫిజికల్ కీబోర్డులను అందించారు. ఈ రెండు ఫోన్లలోనూ డ్యూయల్ సిమ్ ఫీచర్ ఉంది. నోకియా 125 రెండు రంగుల్లో లాంచ్ కాగా, నోకియా 150(2020) మూడు రంగుల్లో లాంచ్ అయింది. నోకియా 125లో 4 ఎంబీ ర్యామ్, 4 ఎంబీ స్టోరేజ్ ను అందించారు. దీని ధర రూ.1,999గా ఉంది. చార్ కోల్ బ్లాక్, పౌడర్ వైట్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. నోకియా 125 సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది.

Nokia Mobile India

ఇందులో 2.4 అంగుళాల క్యూవీజీఏ కలర్ డిస్ ప్లేను అందించారు. ఫిజికల్ టీ9 కీబోర్డును కూడా ఇందులో అందించారు. ఎంటీకే సీపీయూను ఇందులో అందించారు. నోకియా 125లో కెమెరా లేదు. 1020 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ఇందులో ఉంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 23.4 రోజుల స్టాండ్ బై లేదా 19.4 గంటల టాక్ టైం లభిస్తుంది. ఇందులో ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఎఫ్ఎం రేడియో ఉన్నాయి. జీఎస్ఎం 900/1800 నెట్ వర్క్ బ్యాండ్ లను ఇది సపోర్ట్ చేస్తుంది. దీని మందం 1.5 సెంటీమీటర్లు కాగా, బరువు 91.3 గ్రాములుగా ఉంది.

జియో నుంచి రెండు సరికొత్త ప్లాన్లు, క్రికెట్ అభిమానుల కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితం, ఆఫర్లపై ఓ లుక్కేయండి

నోకియా 150(2020)లో కూడా 4 ఎంబీ ర్యామ్, 4 ఎంబీ స్టోరేజ్ నే అందించారు. దీని ధర రూ.2,299గా ఉంది. బ్లాక్, సియాన్, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. వీటికి సంబంధించిన సేల్ కూడా నేటి నుంచే ప్రారంభం కానుంది. ఇందులో కూడా నోకియా 125 తరహాలోనే స్పెసిఫికేషన్లు అందించారు. కాకపోతే ఇందులో కొన్ని అదనపు ఫీచర్లు అందించారు. ఇందులో వెనకవైపు వీజీఏ కెమెరాను అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు స్లాట్ ద్వారా స్టోరేజ్ ను 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో ఎంపీ3 ప్లేయర్, బ్లూటూత్ వీ3.0 ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని మందం 1.5 సెంటీమీటర్లు కాగా, బరువు 90.5 గ్రాములు. స్మార్ట్ ఫోన్ కు బ్యాకప్ గా ఫీచర్ ఫోన్ కావాలనుకునే వారికి ఇవి మంచి ఆప్షన్లు