Mobile Apps. Representational image. (Photo Credit: Pixabay)

New Delhi, FEB 05: చైనాకు మరోసారి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. భారీ స్థాయిలో రెండోసారి డిజిటల్ స్ట్రైక్ (Digetal strike) చేసింది. చైనాకు చెందిన బెట్టింగ్ (betting apps), లోన్ యాప్స్ పై (Loan apps) కేంద్రం కొరడా ఝళిపించింది. 138 బెట్టింగ్ యాప్స్ పై నిషేధం విధించింది. అలాగే 94 లోన్ యాప్స్ పైనా బ్యాన్ (China apps ban) విధించింది. మొత్తంగా చైనాతో సంబంధం ఉన్న 232 యాప్స్ పై కేంద్రం చర్యలు చేపట్టింది. వీటిని ప్లే స్టోర్ ని తొలగించింది. గతంలో టిక్ టాక్ (Tik tok) సహా పలు చైనాకు సంబంధించిన యాప్ లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా భారీగా చైనా యాప్స్ పై చర్యలు చేపట్టింది. చైనాతో (China) సంబంధాలున్న యాప్‌లపై కేంద్రం కన్నెర చేసింది. 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధించింది. ఈ యాప్స్‌.. ప్రజలను అప్పుల ఊబిలోకి దించడంతో పాటూ గూఢచర్య సాధనాలుగా మారే ఆస్కారం కూడా ఉందని హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వీటితో దేశ ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించాయి.

Google Bans 12 Android Apps: ప్లే స్టోర్ నుండి 12 యాప్‌లను తొలగించిన గూగుల్, వెంటనే వాటిని మీ మొబైల్స్ నుండి తీసేయాలని యూజర్లకు హెచ్చరిక 

కాగా, భారత ప్రభుత్వం 6 నెలల క్రితమే 288 చైనా లోన్‌ యాప్‌లపై సమీక్ష ప్రారంభించింది. వీటిలో 94 యాప్‌లు వివిధ ఈ-స్టోర్లలో అందుబాటులో ఉండగా మిగిలినవి థర్డ్ పార్టీ లింక్స్ ద్వారా అందుబాటులో ఉన్నాయని తేల్చింది. సర్వర్ సైడ్ భద్రతా వ్యవస్థల దుర్వినియోగంతో ఈ యాప్‌లను గూఢచర్య సాధనాలుగా మార్చొచ్చని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్‌ల ద్వారా దేశ ప్రజల సమాచారం విద్రోహశక్తులకు చేరితే.. యావత్ దేశంపై నిఘా పెట్టే అవకాశం ఉందన్నారు. వీటిని నిషేధించాలని తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు గతంలోనే హోం శాఖను కోరినట్టు సమాచారం.

Instagram Blue Tick: ఇకపై ఇన్‌స్టాగ్రామ్ బ్లూ టిక్ కోసం కూడా చెల్లించాల్సిందే! ట్విట్టర్ దారిలోనే చార్జీలు పెట్టిన ఇన్ స్టాగ్రామ్ 

ఈ యాప్‌ల సృష్టికర్తలందరూ చైనా దేశస్తులే. భారత్‌లో యాప్‌ కార్యకలాపాల కోసం వారు ఇక్కడి వారిని డైరెక్టర్లుగా నియమించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని లోన్‌ల వైపు ఆకర్షించాక.. వడ్డీ రేట్లను అమాంతం 3000 శాతం మేరకు ఈ యాప్‌లు పెంచేస్తున్నాయి. ఫలితంగా లోన్‌లు చెల్లించలేకపోయిన వారిపై యాప్‌‌ల నిర్వాహకులు వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ యాప్‌ల బారిన పడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ క్రమంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. చైనా కుతంత్రాలు గుర్తించిన కేంద్రం.. దానికి అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు చేపట్టింది.