New Delhi, SEP 27: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తాజాగా శుక్రుడి గ్రహంపై పరిశోధనలు చేయనుందా? అంటే అవునంటున్నారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ (Somanth). చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1 మిషన్ (Adithya L-1) తర్వాత ఇస్రో వీనస్ మిషన్‌ను (Venus Mission) చేపట్టనున్నట్లు సోమనాథ్ చెప్పారు. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అయిన శుక్రుడి భారత మిషన్ చేపట్టనుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చైర్మన్ ఎస్ సోమనాథ్ మంగళవారం ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టులో చంద్రుని మిషన్ చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన తర్వాత భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల్లో కీలకమైన దశను సూచించారు.
శుక్రుడి మిషన్ ను (Venus Mission) చేపడతామని ఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీని ఉద్దేశించి సోమనాథ్ చెప్పారు. (ISRO chairman Somnath) శుక్ర గృహాన్ని అధ్యయనం చేయడం వల్ల అంతరిక్ష శాస్త్ర రంగంలోని అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. శుక్రగ్రహం చాలా ఆసక్తికరమైన గ్రహమని, దీని వాతావరణ పీడనం భూమి కంటే 100 రెట్లు ఎక్కువ అని ఆయన చెప్పారు. నాసా భవిష్యత్తులో వీనస్ మిషన్లు 2029, 2030, 2031లో చేపట్టే అవకాశం ఉంది. చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ 2న సూర్యునిపై అధ్యయనం చేసేందుకు భారతదేశపు తొలి అంతరిక్ష ఆధారిత మిషన్ ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌకను ఇస్రో ప్రయోగించింది. అనంతరం ఇస్రో వీనస్ మిషన్ పై దృష్టి సారించనుంది.