ఇండియాలో రిలయన్స్ జియో నెట్‌వర్క్ డౌన్( Jio Down ) అయింది. జియో నెట్‌వర్క్ సరిగా రావడం లేదని యూజర్లు భారీగా ఫిర్యాదు చేస్తున్నట్లు డౌన్‌డిటెక్టర్ (Downdetector) చూపించింది. కొందరు యూజర్లకు ఈ సమస్య ఎదురైంది. అయితే ఈ నెట్‌వర్క్ డౌన్ అనేది ఒక్క ప్రాంతానికే పరిమితమా లేదంటే దేశమంతా ఉందా అన్నదానిపై జియో నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నెట్‌వర్క్ సరిగా రావడం లేదని కొందరు యూజర్లు ట్విటర్ ద్వారా కూడా ఫిర్యాదు చేశారు.
ఇక ఇండియాలో ట్విటర్‌లో #jiodown ట్రెండింగ్‌లో ఉంది. డౌన్‌డిటెక్టర్‌లో 4 వేల మందికిపైగా యూజర్లు జియో నెట్‌వర్క్‌పై రిపోర్ట్ చేశారు. బుధవారం ఉదయం నుంచీ ఈ సమస్య ఎదురవుతున్నట్లు కొందరు చెప్పారు. జియో అధికారిక కస్టమర్ సపోర్ట్ హ్యాండిల్ @JioCareకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే అప్పుడప్పుడూ సమస్య వస్తోందని, దీనిపై తమ టీమ్స్ పని చేస్తున్నాయని జియో సమాధానమిచ్చింది.