Mumbai, November 30: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఫైబర్ మరో రెండు కొత్త ఆఫర్ల(2 New Offers)ను ప్రకటించింది.యూజర్ల కోసం add-on ప్రీపెయిడ్ వోచర్ల(prepaid plan voucher)ను అందిస్తోంది. అందులో ఒకటి నెలవారీ ప్లాన్ రూ.351 కాగా రెండోది వారాంతపు ప్లాన్ (Weekly Plan) రూ.199 రీఛార్జ్. ఈ కొత్త ప్రీపెయిడ్ వోచర్ల సాయంతో జియో ఫైబర్ యూజర్లు (Jio Fiber Users) మరిన్ని బెనిఫెట్స్ పొందవచ్చు.
ప్రస్తుత హైస్పీడ్ డేటా డౌన్ లోడ్ క్వాటా అయిపోతే వెంటనే ఈ ప్రీపెయిడ్ వోచర్ తో రీఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా జియో ఫైబర్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను పాత ప్లాన్లతో కలిపి వాడుకోవచ్చునని కంపెనీ చెబుతోంది. ఈ ప్లాన్ల ప్రారంభ ధర రూ.699 నుంచి రూ.8వేల 499 వరకు ఉన్నాయి.
జియో ఫైబర్ కస్టమర్లు రూ.351లతో ఫైబర్ ప్లాన్ వోచర్ తీసుకుంటే నెలకు 10Mbps డౌన్ లోడ్ స్పీడ్ తో 50GB హైస్పీడ్ డేటా పొందవచ్చు. అదే రూ.199 ఫైబర్ రీఛార్జ్ ప్లాన్ పై (Weekly Plan) 7 రోజుల పాటు 100Mbps స్పీడ్ తో Unlimited డేటా యాక్సస్ చేసుకోవచ్చు. ఇందులో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా యాక్సస్, కాంప్లిమెంటరీ టీవీ వీడియో కాలింగ్ ఆఫర్లను అందిస్తోంది.
మరోవైపు రిలయన్స్ జియో రూ.351 జియో ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్ ఓచర్ (Jio Fiber prepaid plan voucher) అందిస్తోంది. FTTX నెలవారీ ప్లాన్ PV-351 ప్లాన్ పేరుతో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ వోచర్ ఖరీదు టాక్సులతో కలిపి రూ.414.18 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, నెలకు 50GB హైస్పీడ్ డేటాను 10Mbps స్పీడ్‌తో పొందవచ్చు.
అలాగే రూ.199 జియో ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్ ఓచర్ అందిస్తోంది. FTTX విక్లీ ప్లాన్ (FTTX Weekly Plan) PV-199 ప్లాన్ పేరుతో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఏడు రోజుల పాటు అన్ లిమిటెడ్ డేటా యాక్సస్ చేసుకోవచ్చు. కస్టమర్ ప్రీమైజ్ ఎక్విప్ మెంట్ (CPE) కింద ఈ రెండు ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్ వోచర్లు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిపై సెక్యూరిటీ డిపాజిట్ కింద రిఫండబుల్ మొత్తం రూ.3వేల 500, రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది.
జియో ఫైబర్ యూజర్లు తమ కోర్ బ్యాలెన్స్ ద్వారా ఆటో డెబిట్ మోడ్ సెట్ చేసుకోవచ్చు. దీంతో నేరుగా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ వోచర్లను పొందవచ్చు. రీఛార్జ్ మోడ్ ద్వారా కూడా యూజర్లు ఈ ప్లాన్లు యాక్టివేట్ చేసుకోవచ్చు.