Jio 336 Days Validity Plan: ఒక్కసారి రీఛార్జ్ చేయండి, 336 రోజుల పాటు అపరిమిత ప్రయోజనాలు పొందండి, పాత ప్లాన్ల ప్లేసులోకి కొత్త ప్లాన్ తీసుకువచ్చిన జియో
Reliance Jio Launches New Rs 2121 Recharge Plan with 336 Days Validity, Rs 2020 Plan Revoked (Photo-JIo Website)

Mumbai, Febuary 23: దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) సరికొత్త వార్షిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. 336 రోజుల చెల్లుబాటుతో (Jio 336 Days Validity Plan) రూ. 2,121 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

జియో డిజిటల్ పేమెంట్ యాప్ వచ్చేసింది

కొత్త రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత జియో-టు-జియో కాలింగ్‌, ల్యాండ్‌లైన్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే జియోయేతర కాలింగ్‌కు 12,000 నిమిషాల టాక్‌టైం లభించనుంది.

దీంతోపాటు రోజూ 100 ఎస్ఎంఎస్ సందేశాలు ఉచితంగా లభిస్తాయి. ఇంకా జియో టీవీ (Jio TV), జియో సినిమా (Jio Cinima), జియో న్యూస్‌ (Jio News) యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ వుంటుంది. రూ. 2,121 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జియోతోపాటు, గూగుల్ పే , పేటీఎమ్‌తో సహా వివిధ థర్డ్ పార్టీ రీఛార్జ్ ఛానెళ్ల ద్వారా కూడా తాజా ప్లాన్ అందుబాటులో ఉంది.

ఈ ప్లాన్ రావడంతో పాత ప్లాన్లకు జియో స్వస్తి చెప్పింది. ఇందులో భాగంగా గత ఏడాది డిసెంబర్‌లో పరిమిత కాల ఆఫర్‌గా 365 రోజుల వాలిడిటీతో తీసుకొచ్చిన "2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్" రూ. 2,020 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించింది. దీంతో పాటు తన యాప్ లో కొన్ని ప్లాన్ల కేటగిరీలను కూడా జియో మార్చివేసింది.