Mumbai, November 11: దేశీయ టెలికాం రంగ దిగ్గజం జియో (Reliance Jio) ముందుగానే తెలిపినట్లు తన వినియోగదారులకు సెట్ టాప్ బాక్సు(Jio Set-top Box)లను పంపిణీ చేయడం ప్రారంభించింది.ట్రయల్ పీరియడ్ ముగిసి జియో సర్వీసులకు నగదు చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి కంపెనీ సెట్ టాప్ బాక్సులను అందిస్తోంది. ఈ సెట్ టాప్ బాక్సులను అందుకున్న వారు తెలుపుతున్న వివరాలను ప్రకారం 150 చానెళ్ల (150 Live TV channels)వరకు ఈ సెట్ టాప్ బాక్స్ ద్వారా జియో అందిస్తుందని తెలుస్తోంది.
కాగా ఈ సెట్ టాప్ బాక్స్ తో జియో టీవీ యాప్ వస్తుందని అనుకున్న వారికి నిరాశ ఎదురైంది. ఎందుకంటే ఈ యాప్ ద్వారా దాదాపు 650 చానెళ్ల వరకు ఉచితంగా వీక్షించవచ్చు.
అయితే జియో టీవీ కాకుండా జియో టీవీ+ అనే ప్రత్యేకమైన యాప్ ను ఇందులో అందించారు. ఈ యాప్ ద్వారా టీవీ చానెళ్లను మాత్రమే OTT స్ట్రీమింగ్ సర్వీసుల కంటెంట్ ను కూడా అందించనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటుగా OTT యాప్స్ ద్వారా కొన్ని టీవీ చానెళ్లను కూడా జియో అందించనున్నట్లు తెలుస్తోంది.
షియోమి టీవీల్లో అందించే ప్యాచ్ వాల్ యూజర్ ఇంటర్ ఫేస్, వన్ ప్లస్ టీవీల్లో అందించే ఆక్సిజన్ ప్లేల తరహాలో జియో టీవీ+ కూడా కంటెంట్ ను అందించే ఒక యాప్. జియో టీవీ+ ద్వారా టీవీ చానెళ్లను కూడా వీక్షించవచ్చు. అంటే ఈ యాప్ ద్వారా మీకు నచ్చిన చానెళ్లను కేవలం ఇంటర్నెట్ ద్వారా చూడవచ్చు.
జియో ఫైబర్ సబ్ స్క్రిప్షన్లు రూ.699 నుంచే ప్రారంభం అయినప్పటికీ ఓటీటీ యాప్స్ యాక్సెస్ కావాలంటే మాత్రం రూ.849తో రీచార్జ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే రూ.849, అంతకంటే ఎక్కువ రీచార్జ్ ప్లాన్స్ కు మాత్రమే ఓటీటీ యాప్స్ ను జియో అందించింది.