JioBharat 4G Phone (Photo-Amazon Website)

టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో నుంచి ఇటీవల వచ్చిన JioBharat 4G ఫోన్ అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి గల వినియోగదారులు రూ.999 వద్ద ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మొత్తం 23 భాషలకు మద్దతు ఇస్తుందని విడుదల సందర్బంగా జియో ప్రకటించింది.

కార్బన్‌తో కలిసి తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 1000mAh బ్యాటరీ , మైక్రో SD కార్డ్ వంటి ఫీచర్లతోపాటు స్విఫ్ట్ 4G ఇంటర్నెట్‌ కనెక్ట్ సామర్థ్యంతో వచ్చింది.ఎక్స్‌టర్నల్‌ మైక్రో SD కార్డ్ సపోర్ట్ ద్వారా వినియోగదారులు 128GB వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు. "భారత్" , వెనుక కార్బన్ లోగోను డ్యూయల్ బ్రాండింగ్‌తో వస్తుంది.

ఈఫోన్‌ లాంచింగ్‌ సందర్బంగా స్పెషల్‌గా రూ. 123 ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ 28 రోజుల వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్‌లు, 14 GB డేటా అందిస్తుంది. డియో స్ట్రీమింగ్‌ను ప్రారంభించే Jio యాప్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది. అయితే, భవిష్యత్తులో ఇతర రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు

JioBharat 4G ఫీచర్లు

1.77-అంగుళాల TFT డిస్‌ప్లే

3.5mm హెడ్‌ఫోన్ జాక్‌

0.3MP కెమెరా విత్‌ LED ఫ్లాష్‌

1000mAh బ్యాటరీ