Jio launches 'Work From Home Pack' for Rs 251 (Photo-Ians)

రిలయన్స్‌ జియో బంపర్‌ ఆఫర్‌ (Jio Bumper Offer) ప్రకటించింది. ఐదు నెలల పాటు ఉచిత 4జీ డేటా, జియో-జియో ఫ్రీ ఫోన్‌ కాల్స్‌ను (Jio to Jio free Calls) ఇస్తున్నట్లు ప్రకటించింది. జియోఫై 4జీ వైర్‌ లెస్‌ హాట్‌స్పాట్‌ కొనుగోలు దారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియోఫైని జియో స్టోర్‌లో కానీ, ఆన్‌లైన్‌లో కానీ కొనుగోలు చేయాలి. దీని ధర రూ.1,999గా ఉంది. అది కొన్న తరువాత జియోఫైకి సంబంధించిన ప్లాన్లలో ఏదో ఒక దానితో సిమ్‌ను యాక్టివేట్‌ చేయించుకోవాలి. ఒకసారి సిమ్‌ యాక్టివేట్‌ అయిన తరువాత దానిని జియోఫైలో (Jiofi) వేసి ఉపయోగించుకోవచ్చు. సిమ్‌ యాక్టివేట్‌ అయ్యిందో లేదో అన్న విషయాన్ని మై జియో యాప్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రూ. 199, రూ 249, రూ. 349 ఆఫర్లతో సిమ్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. వీటిలో అత్యంత చౌకైన ఆఫర్ రూ. 199, దీని ద్వారా 28 రోజుల వాలిడిటితో ప్రతిరోజూ 1.5GB డేటాను పొందవచ్చు. దీనికి అదనంగా జియో ప్రైమ్ సభ్యత్వం పొందటానికి రూ.99లో రిచార్జ్‌ చేయించుకుంటే 28 రోజులకు ప్రతిరోజూ 1.5 జీబీ డేటా, అపరిమిత జియో- జియో కాల్స్, 1000 జియో నుంచి ఇతర మొబైల్ నెట్‌వర్క్ నిమిషాలు, 140 రోజుల పాటు రోజుకు 100 జాతీయ ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు. రిలయన్స్ చేతికి టిక్ టాక్ ? సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్త, అధికారికంగా స్పందించేందుకు నిరాకరించిన రిలయన్స్ గ్రూపు

రెండవ ఆఫర్ రూ. 249

ఇది 28 రోజుల పాటు ప్రతిరోజూ 2GB డేటాను అందిస్తుంది. ఇక్కడ కూడా మీరు అదనంగా రూ. జియో ప్రైమ్ సభ్యత్వానికి 99 రీఛార్జ్‌ చేయిస్తే రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత జియో-జియో కాల్స్, 28 రోజుల పాటు 1000 జియో నుంచి ఇతర మొబైల్ నెట్‌వర్క్ నిమిషాలు, 112 రోజుల పాటు రోజుకు 100 జాతీయ ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు.

మూడవ ఆప్షన్ రూ. 349

ఇది మీకు 28 రోజుల పాటు ప్రతిరోజూ 3జీబీ డేటాను అందిస్తుంది. రూ. 99 అదనపు, జియో ప్రైమ్ సభ్యత్వంతో 28 రోజుల పాటు మీకు రోజుకు 3 జీబీ డేటా, అపరిమిత జియో-జియో కాల్స్, 1,000 నిమిషాల జియో - ఇతర మొబైల్ నెట్‌వర్క్ కాల్స్‌, 84 రోజుల పాటు రోజుకు 100 జాతీయ ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.