Lava Blaze Curve 5G | Photo: Lava mobiles

Lava Blaze Curve 5G: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తాజాగా సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 'లావా బ్లేజ్ కర్వ్ 5G' పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటు ధరల శ్రేణిలోనే ప్రీమియం ఫీచర్ల ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా కర్డ్వ్ AMOLED డిస్‌ప్లే, సోనీ సెన్సార్ కలిగిన 64MP మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 256GB వరకు అంతర్గత స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా డిజైన్ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ చాలా మెరుగ్గా ఉంది. దీని బ్యాక్ ప్యానెల్ AG గ్లాస్ డిజైన్‌తో వస్తుంది.

లావా బ్లేజ్ కర్వ్ 5G రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఫోన్ ఐరన్ గ్లాస్ మరియు విరిడియన్ గ్లాస్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది, ఆపై మూడు సంవత్సరాల పాటు రెగ్యులర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందజేస్తుందని కంపెనీ తెలిపింది.

అదనంగా, Lava Blaze Curve 5G స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.

Lava Blaze Curve 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల పూర్తి HD+ AMOLED కర్డ్వ్ డిస్‌ప్లే
  • 8GBRAM, 128/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్
  • వెనకవైపు 64MP +8MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్

లావా బ్లేజ్ కర్వ్ 5Gలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, సామీప్య సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్,  యాంబియంట్ లైట్ సెన్సార్‌తో సహా అవసరమైన అన్ని సెన్సార్‌లు ఉన్నాయి.

ధరలు:

8GB RAM+128GB స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్ కలిగిన వేరియంట్ ధర: రూ. 17,999/-

8GB RAM+256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర: రూ. 18,999/-

ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 11 నుండి అమెజాన్, లావా వెబ్‌సైట్ సహా కొన్ని రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.