Lava O2 Launch Live Streaming (Photo Credits: Lava Mobiles Official

Lava O2 Smartphone: భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా మొబైల్స్ తాజాగా మరొక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Lava O2 పేరుతో భారత మార్కెట్లో విడుదలయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 8 వేల సరసమైన ధరలోనే లభించనుంది. అయినప్పటికీ ఇందులో అద్భుతమైన ఇంటర్నల్ స్టోరేజీ, మెరుగైన కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ సామర్థ్యం. కంపెనీ ప్రకారం Lava O2 లోని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 38 గంటల టాక్ టైమ్ మరియు 500 గంటల స్టాండ్‌బై టైమ్‌ని అందజేస్తుందని చెప్పబడింది.

సుమారు 200 గ్రాముల బరువుతో ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ స్టోరేజీ పరంగా ఏకైక కాన్ఫిగరేషన్ 8GB RAM మరియు 128GBలో లభిస్తుంది. అయితే ర్యామ్ ను వర్చువల్‌గా 16జీబీ వరకు అలాగే స్టోరేజీని మైక్రోSD కార్డ్ ద్వారా 512జీబీ వరకు విస్తరింపజేసుకునే వీలుంది. ఈ ఫోన్ ఇంపీరియల్ గ్రీన్, మెజెస్టిక్ పర్పుల్ మరియు రాయల్ గోల్డ్ అనే మూడు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.

Lava O2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లే
  • 8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • యూనిసోక్ T616 ఆక్టా-కోర్ ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+2 AI ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్
  • ధర: రూ. 8,499/-

కనెక్టివిటీ కోసం 4G VoLTE, బ్లూటూత్ 5, GPRS, OTG, Wi-Fi 802.11 b/g/n/ac, 3.5mm ఆడియో జాక్ మరియు USB టైప్-C పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ మొదలైన ఫీచర్లను ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్చి 27 నుండి అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ప్రారంభోత్సవ ఆఫర్ లో భాగంగా రూ. 500 తక్షణ డిస్కౌంట్ అందిస్తున్నారు. కాబట్టి రూ. 7,999 ధరకే దీనిని సొంతం చేసుకోవచ్చు.