Free Jio Wi-Fi calling starts rolling out, works with over 150 phones and all Wi-Fi networks (Photo-PTI)

Trai ఆదేశంతో టెలికం కంపెనీలు నెలవారీ ప్లాన్లను తీసుకొచ్చాయి. ఒక్కో కంపెనీ ఒకటికి మించిన రీచార్జ్ వోచర్లను ప్రవేశపెట్టాయి. 30 రోజులు (Monthly Recharge Plans), లేదా నెలవారీ ప్లాన్ ను తీసుకురావాలని ట్రాయ్ లోగడే టెలికం కంపెనీలను ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త ప్లాన్లను (prepaid recharge plans) ప్రవేశపెట్టాయి. వీఐ రూ.319 ప్లాన్లో భాగంగా యూజర్లు రోజువారీ 2 జీబీ ఉచిత డేటా వినియోగించుకోవచ్చు. అపరిమిత ఉచిత కాలింగ్, నిత్యం 100 ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా పొందొచ్చు. దీని కాలవ్యవధి నెలగా ఉంది.

ఇక వీఐ (Vodafone Idea) రూ.195లో అపరిమిత ఉచిత కాలింగ్ తోపాటు, 300 ఉచిత ఎస్ఎంఎస్ లు ఈ ప్లాన్ లో భాగంగా లభిస్తాయి. ప్లాన్ వ్యాలిడిటీ 31 రోజులు. నెల మొత్తం మీద ఉచిత డేటా 2జీబీ మాత్రమే ఉంటుంది.వీఐ రూ.337 ప్లాన్ అయితే కాల్స్ ఉచితం. రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితమే. 28జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. వ్యాలిడిటీ 31 రోజులు. వీఐ రూ.327 ప్లాన్ అయితే అపరిమిత ఉచిత కాలింగ్ తోపాటు రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితమే. 25 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. వ్యాలిడిటీ 30 రోజులు.

గూగుల్ సెర్చ్‌లో మీ మొబైల్ నెంబర్ ఉందా? వెంటనే డిలీట్ చేయండి, లేకపోతే మీకే డేంజర్, గూగుల్ స్టోర్ నుంచి మీ పర్సనల్ డీటైల్స్ ఇలా తొలగించండి

జియో రూ.256 ప్లాన్ కేలండర్ ప్రకారం ఒక నెల వ్యాలిడిటీతో వస్తుంది. ఉదాహరణకు మే 2న రీచార్జ్ చేస్తే జూన్ 1తో వ్యాలిడిటీ ముగుస్తుంది. ఉచిత కాల్స్ కు పరిమితి లేదు. రోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితం. రోజువారీ 1.5 జీబీ డేటా ఉచితం. జియో యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. జియో రూ.296 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కాల్స్ ఉచితం. నిత్యం 100 వరకు ఎస్ఎంఎస్ లు ఉచితం. రోజువారీ 2 జీబీ డేటా కూడా ఉచితం. జియో యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

ఎయిర్ టెల్ రూ.319ప్లాన్ వ్యాలిడిటీ నెల రోజులు. రోజువారీ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. కాల్స్ కూడా పరిమితి లేకుండా ఉచితంగా చేసుకోవచ్చు. ఎయిర్ టెల్ రూ.296 ప్లాన్ అయితే 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కాల్స్ తోపాటు, రోజువారీగా 100 వరకు ఎస్ఎంఎస్ లు ఉచితం. 25 జీబీ డేటా ఉచితం. రోజువారీ పరిమితి అమలు కాదు. ప్లాన్ వ్యాలిడిటీ ముగిసే లోపు ఈ డేటాను వినియోగించుకోవచ్చు.