New Delhi: తమ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ - నోకియా సంయుక్తంగా నోకియా 4K స్మార్ట్ టీవీ (Nokia Smart TV 4K) ని భారత మార్కెట్లో విడుదల చేశారు. ఇది మొట్టమొదటి నోకియా బ్రాండెడ్ స్మార్ట్ టీవీ. 55-అంగుళాల స్క్రీన్ పరిధి కలిగిన ఈ టీవి డిసెంబర్ 10 నుంచి ఈ- కామర్స్ ప్లాట్‌ఫామ్ (Flipkart)లో అమ్మకాలు చేపట్టనున్నారు. దీని ధర రూ. 41,999/- గా నిర్ణయించారు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు కొనుగోలు చేసే వినియోగదారులకు 10% డిస్కౌంట్ లభించనుంది. అదనంగా రూ. 999/- తో 3 సంవత్సరాల వారంటీని కల్పిస్తున్నారు. ఈ నోకియా స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు బండిల్డ్ స్టాండ్‌తో పాటు వాల్ మౌంట్, బ్లూటూత్ రిమోట్ మరియు వాయిస్ ఇన్‌పుట్ నియంత్రణ కోసం గూగుల్ అసిస్టెంట్ డివైస్ లను అందిస్తున్నారు.
ఈ నోకియా స్మార్ట్ టీవి యొక్క సౌండ్ జెబిఎల్ (JBL Sound Technology) చేత రూపొందించబడింది, ఇది వినియోగదారులకు స్పష్టమైన స్వరాలు మరియు శ్రావ్యమైన ధ్వని తరంగాలను అనుభవించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే ఈ టీవీ సౌండ్ సిస్టమ్ లోని లోతైన బేస్ (Bass) టోన్‌లకు భారతీయ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తుంది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం ఆడియో అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ టీవీకి 24 వాట్ల ఇంటర్నల్ స్పీకర్లు, "డిటిఎస్ ట్రూసర్‌రౌండ్" మరియు డాల్బీ ఆడియో పీచర్స్ ఉన్నాయి.
Check video:
నోకియా బ్రాండెడ్ స్మార్ట్ టీవీలో 55-అంగుళాల 4కె యుహెచ్‌డి స్క్రీన్ 400 నిట్స్ గరిష్ట ప్రకాశం కలిగి ఉంటుంది. గొప్ప దృశ్య అనుభవానికి (Visual Experience) డాల్బీ విజన్ సపోర్ట్, MEMC మరియు ఇంటెలిజెంట్ డిమ్మింగ్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. కేబుల్ కనెక్షన్ లేకుండా 150 ఛానళ్లు చూడొచ్చు, జియో సెటప్ బాక్స్‌తో
ఇక హార్డ్ వేర్ విషయానికి వస్తే, ఇది క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే 2.25GB RAM , 16GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్, మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB (2.0 మరియు 3.0) పోర్ట్‌లు, Wi-Fi మరియు బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ అదనపు ఆకర్శణలు. దీనిలోని ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక యాప్స్ ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.