OnePlus 12R Smartphone: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'వన్‌ప్లస్' తాజాగా OnePlus 12Rకు మరొక స్టోరేజ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. వన్‌ప్లస్ ఇదివరకే దేశంలో ఈ ఏడాది ప్రారంభంలో OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ను 8GB/128GB మరియు 16GB/256GB రెండు వేరియంట్‌లతో లాంచ్ చేసింది. ఇప్పుడు మరొక కొత్త వేరియంట్ చేరికతో ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉండనుంది. అయితే కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రం 'జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్' కూడా అందుబాటులో ఉంటుంది.
ఇదిలా ఉంటే, కొత్త వేరియంట్ యొక్క మిగిలిన స్పెసిఫికేషన్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఈ ఫోన్ బ్లాక్, ఐరన్ గ్రే, కూల్ బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏ విధంగా ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద పరిశీలించండి.
OnePlus 12R స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78-అంగుళాల LTPO 4.0 AMOLED డిస్‌ప్లే, 1.5K పిక్సెల్ రెసల్యూషన్
- 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+8MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 100W SuperVOOC వైర్డ్ ఛార్జింగ్
- ధర: రూ. 42,999/-
OnePlus 12R స్మార్ట్‌ఫోన్ మిగతా వేరియంట్ల ధర 8GB RAM + 128GB కోసం రూ. 39,999 అలాగే 16GB RAM + 256GB వెర్షన్ కోసం రూ. 45,999 గా ఉంది.
కొత్త వేరియంట్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు మార్చి 21 నుండి ప్రారంభమవుతాయి. Amazon, OnePlus.in సహా OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. ప్రారంభోత్సవ ఆఫర్‌గా, ఈ ఫోన్ కొనుగోలుదారులకు రూ. 4,999 విలువైన OnePlus బడ్స్ Z2ని ఉచితంగా అందిస్తున్నారు.