OnePlus Nord 5G: రూ.25 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్, వన్‌ప్లస్ నార్డ్‌ను విడుదల చేసిన కంపెనీ, ఆగస్టు 4 నుంచి ఇండియాలో అమ్మకాలు
OnePlus Nord Smartphone Launched In India (Photo Credits: OnePlus India)

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్‘నార్డ్’ (OnePlus Nord 5G) 5జీ ఫోన్ ఎట్టకేలకు  ఇండియన్‌ మార్కెట్లో విడుదల అయింది. తన కొత్త మొబైల్‌ OnePlus Nord 5జీ ఫోన్ ను కంపెనీ ఇండియాలో లాంచ్‌ చేసింది. 5జీ కనెక్టివిటీ, పంచ్ హోల్‌ డిస్‌ప్లే డిజైన్‌, క్వాడ్ రియర్‌ కెమెరా ప్రధాన ఫీచర్లుగా (OnePlus Nord Features) ఉన్నాయని వన్‌ప్లస్ కంపెనీ ప్రకటించింది. అంతేకాదు "ఫాస్ట్ అండ్ స్మూత్" అనుభవాన్ని అందించడానికి వన్‌ప్లస్ నార్డ్‌కు దాదాపు 300 ఆప్టిమైజేషన్లను అందించినట్లు కంపెనీ పేర్కొంది.

మూడు వేరియంట్లలో లాంచ్‌ చేసిన వన్‌ప్లస్ నార్డ్ ఆగస్టు 4 నుండి అమెజాన్, వన్‌ప్లస్.ఇన్ ద్వారా భారతదేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అయితే, ప్రారంభంలో 8 జీబీ, 12 జీబీ ర్యామ్ వేరియంట్లు (OnePlus Nord Variants) మాత్రమే ఇవ్వబడతాయి. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వెర్షన్ సెప్టెంబర్‌లో వస్తుంది. షియోమి ఇతర సంస్థల మాదిరిగా కాకుండా, వన్‌ప్లస్ మొదటి రోజు నుండి నార్డ్‌ను ఓపెన్ సేల్‌గా అందించనుంది. ప్రీ-బుకింగ్ వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్ ద్వారా జూలై 22 నుంచి, జూలై 28 నుంచి అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంటుంది.

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లతో 2 వేల రూపాయల తగ్గింపును ఇస్తోంది. అదనంగా రిలయన్స్ జియో ద్వారా 6,000 విలువైన ప్రయోజనాలు లభ్యం కానున్నాయి. వన్‌ప్లస్ రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు ప్రత్యేకంగా పొడిగించిన వారంటీ , బైబ్యాక్ ఆఫర్‌, 50 జీబీ విలువైన ఉచిత వన్‌ప్లస్ క్లౌడ్ స్టోరేజ్‌, ఇతర థర్డ్ పార్టీ ప్రయోజనాలు లభిస్తాయి.

వన్‌ప్లస్ నార్డ్ ధర (OnePlus Nord Prices)

6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర 24,999 రూపాయలు

8 జీబీ ర్యామ్‌+ 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ ధర 27,999 రూపాయలు

12 జీబీ+ 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 29, 999 రూపాయలు

వన్‌ప్లస్ నార్డ్ ఫీచర్లు (OnePlus Nord Specs)

6.44 అంగుళాల డిస్‌ ప్లే

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 ప్రాసెసర్

ఆండ్రాయిడ్‌ 10

1080x2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌

32 + 8 మెగాపిక్సెల్ డబుల్‌ సెల్ఫీ కెమెరా

48+ 8+ 5+ 2మెగాపిక్సెల్స్‌ క్వాడ్‌ రియర్‌ కెమెరా

6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌

4100ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

వన్‌ప్లస్ బడ్స్ :

దీంతో పాటుగా కంపెనీ వన్‌ప్లస్ బడ్స్  ను కూడా విడుదల చేసింది. వీటి ధర రూ. 4,990గా ఉంది. ఇవి గూగుల్ పిక్సెల్ బడ్స్‌తో సమానంగా కనిపిస్తున్నాయి. TWS ఇయర్‌బడ్స్‌లో ఆపిల్ ఎయిర్‌పాడ్స్ లాంటి డిజైన్ కూడా ఉంటుంది. ఈ డివైజ్‌లో నలుపు, నీలం, తెలుపు రంగు ఆప్షన్లలో వచ్చింది. 30 గంటల పాటు మీరు అద్భుతమైన సంగీతాన్ని ఎటువంటి అంతరాయం లేకుండా వీక్షించవచ్చని కంపెనీ తెలిపింది.