చైనీస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన కొత్త శ్రేణి స్మార్ట్ టీవీ మోడళ్లను పరిచయం చేస్తోంది. వచ్చేనెల- జూలై 2న భారతదేశంలో రెండు కొత్త వన్‌ప్లస్ టెలివిజన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ ఇండియా ఇటీవల చేసిన ట్వీట్‌లో రాబోయే వన్‌ప్లస్ టీవీ సిరీస్ ధరకు సంబంధించిన విషయాన్ని కొద్దిగా సస్పెన్స్‌లో ఉంచుతూ టీజర్‌లో చూపించారు. ఈ స్మార్ట్ టీవీ మోడళ్ల ధర రూ .1X, 999 నుండి ప్రారంభమవుతాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.
వన్‌ప్లస్ ఇండియా చేసిన ట్వీట్ ప్రకారం, కొత్త వన్‌ప్లస్ టీవీ సిరీస్ ధర 1ఎక్స్, 999 నుండి ప్రారంభమవుతుంది, అంటే ధర రూ .10,999 నుండి రూ .19,999 మధ్య ఉండొచ్చు. రియల్‌మే వంటి తన ప్రత్యర్థి బ్రాండ్లు ఇటీవల టీవీ మోడళ్లను రూ.12,999, రూ .21,999 వద్ద విడుదల చేశాయి. కాబట్టి ఈ మోడెళ్లకు పోటీ ఇచ్చేలా వన్‌ప్లస్ టీవీల ధరలు ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
All 👀 this way ⬇️#SmarterTV pic.twitter.com/HOuvYOszEw
— OnePlus India (@OnePlus_IN) June 8, 2020
వన్‌ప్లస్ విడుదల చేసిన టీజర్లో స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు కాని మిడ్ రేంజ్ నుండి ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ల వరకు మల్టీ స్క్రీన్ సైజులు ఉంటాయని ఇటీవలి వారి పత్రికా ప్రకటన స్పష్టం చేసింది.
గత సంవత్సరం ప్రీమియం విభాగంలో లాంచ్ చేసిన వన్‌ప్లస్ టీవీ క్యూ 1 మరియు క్యూ 1 ప్రోతో పోల్చితే రానున్న ఈ రెండు టీవీ సిరీస్‌లు బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటాయని ప్రచారంలో ఉంది.
ప్రస్తుతం, గ్లోబల్ ఇష్యూగా ఉన్న కరోనా లాక్డౌన్ ఫ్యాక్టర్ ధరలపై ప్రభావం చూపింది. ఉత్తమమైన స్పెసిఫికేషన్లు ఇవ్వడంతో పాటు బడ్జెట్ ధరల్లోనే తమ ప్రొడక్ట్స్ విడుదల చేయడం ద్వారా కంపెనీలు తమ మార్కెట్‌ను నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాయి.