
Oppo F25 Pro 5G Smartphone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో తాజాగా తమ బ్రాండ్ నుంచి సరికొత్త 'ఒప్పో ఎఫ్25 ప్రో' 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది అద్భుతమైన కెమెరా పనితీరు కలిగిన ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. దీని ముందు, వెనుక కెమెరాల ద్వారా 4K వీడియో రికార్డింగ్‌ను చేయవచ్చు. Oppo F25 Proలో అందిస్తున్న AMOLED డిస్‌ప్లే కూడా చాలా మన్నికగా ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ కఠినమైన పాండా గ్లాస్‌తో రూపొందించడంతో పాటు స్క్రాచ్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP65 రేటింగ్ పొందింది.
సొగసైన డిజైన్ కలిగిన ఈ ఫోన్ బరువు కేవలం 177 గ్రాములు మాత్రమే. ఇది లావా రెడ్, బ్లూ షేడ్‌తో రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అలాగే స్టోరేజ్ పరంగా రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఇంకా, Oppo F25 Pro స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Oppo F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే
- 8GBRAM, 128/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్
- వెనకవైపు 64MP + 2MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 67W SuperVOOC ఛార్జింగ్
ధరలు:
8GB RAM+128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కలిగిన వేరియంట్ ధర: రూ. 23,999/-
8GB RAM+256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర: రూ. 25,999/-
ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 5 నుండి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సహా అన్ని OPPO స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే HDFC, ICICI, SBI మొదలైన బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.2,000 డిస్కౌంట్ కూడా లభించనుంది. ప్రీబుకింగ్ చేసుకునే కస్టమర్‌లు మార్చి 5, 2024 వరకు కూపన్‌లు, లాయల్టీ పాయింట్ల ద్వారా Oppo F25 Pro 5G కొనుగోలుతో Enco Buds2ని ఉచితంగా పొందే అవకాశం ఉంది.