ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి.
వీటిలో ఒకటి భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది. మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ దానిలో అందరూ చేరడానికి అవకాశం లేదు, కేవలం ఉద్యోగస్తులు మాత్రమే దీనిలో సభ్యులుగా చేరుతారు.
PF ఖాతాదారులు EPFOలో డిపాజిట్ చేసిన మొత్తంలో తమ పదవీ విరమణ తర్వాత 100శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అంతకంటే ముందే డబ్బు కోసం అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగ భవిష్య నిధి ఖాతా నుంచి కొంత డబ్బును విత్‌డ్రా తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు నేరుగా ఉమాంగ్ యాప్ (UMANG App) ద్వారా PF ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఉమాంగ్ యాప్ ద్వారా డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలి.
1. ముందుగా ఉమంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, మీ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి నమోదు చేసుకోండి.
2. యాప్‌లో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. వాటినుంచి EPFO సెలెక్ట్ చేసుకోండి
3. తర్వాత Raise Claim Option ఆప్షన్ ఎంచుకొని మీ UAN నంబర్ ఎంటర్ చేయండి.
4. అనంతరం EPFOలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
5. మీ PF ఖాతా నుంచి With Drawl ఆప్షన్ ఎంచుకుని, అక్కడ వచ్చే ఫారంను నింపండి.
6. ఫారంను Submit చేసిన తర్వాత విత్‌డ్రా అభ్యర్థన కోసం Reference Numberను పొందండి.
7. ఇచ్చిన Reference Numberను ఉపయోగించి Withdrawal Requestను ట్రాక్ చేయండి.
8. 3-5 రోజులలోపు మీ ఖాతాకు EPFO డబ్బును బదిలీ చేస్తుంది.