PM Narendra Modi (Photo-ANI)

ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాట్సాప్‌ చానెల్‌లో కూడా సత్తాచాటారు. ప్రధాని మోదీ తన వాట్సాప్ ఛానెల్ ప్రారంభించిన ఒక్క రోజులోనే మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను దాటేసి మరో రికార్డు క్రియేట్‌ చేశారు. ఇప్పటికే ఎక్స్(ట్విటర్‌) ఫేస్‌బుక్ ,ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డ్ - సెట్టింగ్ ఫాలోవర్లను సంపాదించారు.

91 మిలియన్ల మంది ఫాలోవర్లతో Xలో అత్యధికంగా ఫాలో అవుతున్న ఇండియన్స్‌లో టాప్‌ ప్రధాని మోదీ. కాగా, ఫేస్‌బుక్‌లో, పీఎం మదీకి 48 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 78 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వాట్సాప్ ఛానెల్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. వాట్సాప్ చానెల్‌లో చేరడం ఆనందంగా ఉంది అంటూ కొత్త పార్లమెంటు భవనం ఫోటోను పోస్ట్‌ చేశారు మోదీ. సెప్టెంబర్ 13న భారతదేశంతో పాటు, 150కి పైగా దేశాలలో WhatsApp ఛానెల్స్‌ను ప్రారంభించింది.

 ప్రధాని మోదీ మరో రికార్డు, వాట్సాప్ ఛానల్‌లో చేరిన తొలిరోజే పది లక్షల మంది ఫాలోవర్లు, జాయిన్ అవ్వాలనుకునే వారికి మోదీ వాట్సాప్ ఛానల్ లింక్ ఇదిగో..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాట్సాప్ ఛానెల్‌లో ఎలా చేరాలి

మీరు ఈ అద్భుతమైన ఫీచర్‌ని యాక్సెస్ చేయడానికి ముందు, మీ WhatsAppని అప్‌డేట్ చేయండి

WhatsAppని ప్రారంభించి, అప్‌డేట్ ట్యాబ్‌ను క్లిక్ చేయండి

మీ స్క్రీన్ దిగువన, మీరు "ఛానెల్‌లను కనుగొనండి" అనే ఎంపికను కనుగొంటారు. దానిపై నొక్కండి.

అందుబాటులో ఉన్న ఛానెల్‌ల జాబితా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా కనిపిస్తుంది. చేరడానికి, ఆ ఛానెల్ పేరు పక్కన ఉన్న ప్లస్ చిహ్నాన్ని నొక్కండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి .

ఛానల్ లింక్ ఇదిగో..

https://www.whatsapp.com/channel/0029Va8IaebCMY0C8oOkQT1F

ప్రత్యామ్నాయంగా, మీరు ఛానెల్ కోసం మాన్యువల్‌గా శోధించడానికి మీ స్క్రీన్ ఎగువ-కుడి మూలలో ఉన్న శోధన చిహ్నాన్ని ఉపయోగించవచ్చు