Poco X6 Neo smartphone | Photo- Poco official

Poco X6 Neo Smartphone: స్మార్ట్‌ఫోన్ మేకర్ POCO తమ బ్రాండ్ లోని X6 సిరీస్ శ్రేణిలో మరొక  స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది.  Poco X6 Neo పేరుతో భారత మార్కెట్లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి, అయినప్పటికీ దీని ధరలు రూ. 15,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. వివిధ బ్యాంక్ ఆఫర్లతో రూ. 1000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ కొత్త పోకో ఫోన్ మిడ్-రేంజ్ శ్రేణిలోని ఇతర బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు దీటైన ప్రత్యర్థిగా నిలుస్తుంది.  iQOO Z9 5G  స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయిన ఒకరోజు తర్వాత, దానికంటే తక్కువ ధరలోనే తమ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసి పోకో కంపెనీ వ్యూహాత్మక అడుగువేసింది.  Poco X6 Neo స్మార్ట్‌ఫోన్‌ భారతీయ మార్కెట్లో రూ. 20 వేలలోపు సెగ్మెంట్‌లోని  Samsung Galaxy F15 5G, Realme 12 5G, Redmi Note 13 5G మరియు iQOO Z9 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లకు ప్రత్యామ్నాయ ఆప్షన్‌గా ఉంటుంది.

Poco X6 Neoలో AMOLED డిస్‌ప్లేతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కూడా కలిగి ఉంది. ఇది మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. ఇది రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది, దీని గరిష్ట స్టోరేజ్ 256GB స్టోరేజ్ కాగా, మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు. ఆప్టిక్స్ పరంగా ఈ ఫోన్ 108MP ప్రైమరీ సెన్సార్ కలిగి ఉంది.  స్ల్పాష్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్ కలిగి ఉంది.

ఇంకా POCO X6 Neo స్మార్ట్‌ఫోన్‌లో  ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.

POCO X6 Neo స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే
  • 8GB/12GB RAM, 128GB/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్
  • వెనకవైపు 108MP+2MP డ్యుఎల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జింగ్

అదనంగా, Poco X6 Neoలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉన్నాయి.

ధరలు:

8GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999 మరియు 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ మరియు మార్టిన్ ఆరెంజ్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభ్యం అవుతుంది. Poco X6 Neo స్మార్ట్‌ఫోన్‌ మార్చి 18 నుండి Flipkartలో అందుబాటులో ఉంటుంది.