Realme 12X 5G | Photo- Realme India official page

Realme 12X 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ రియల్‌మి భారత మార్కెట్లో Realme 12X 5G పేరుతో మరొక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది అందుబాటు ధరలోనే లభించే స్మార్ట్‌ఫోన్‌ అయినప్పటికీ దీనిలో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్‌కు డైనమిక్ బటన్‌ అమర్చబడి ఉంది, దీని ద్వారా ఏరోప్లేన్ మోడ్, DND అలాగే కెమెరా షట్టర్, ఫ్లాష్‌లైట్ మొదలైన విభిన్న ఫంక్షన్‌లను ఆపరేట్ చేయడానికి షార్ట్‌కట్ బటన్‌గా ఉపయోగించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఎయిర్ గెస్చర్స్ ఫీచర్‌కు కూడా మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా దీని డిస్‌ప్లేలోని హోల్-పంచ్ కటౌట్ చుట్టూ యానిమేషన్ ద్వారా కాల్‌లు, ఛార్జింగ్ మరియు ఇతర ముఖ్యమైన నోటిఫికేషన్లను చూపే మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.

ర్యామ్- స్టోరేజ్ ఆధారంగా Realme 12X 5G మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఫోన్ ట్విలైట్ పర్పుల్ మరియు వుడ్‌ల్యాండ్ గ్రీన్ అనే రెండు రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది. అదనంగా, కొత్త Realme 12X 5G స్మార్ట్‌ఫోన్‌లలో ఎలాంటి ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధరలు ఎంత తదితర విషయాలను ఈ కింద పరిశీలించండి.

Realme 12X 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల పూర్తి పూర్తి-HD+ IPS LCD డిస్‌ప్లే
  • 4GB/6GB/6GB RAM, 128GB+ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 45W SuperVOOC ఛార్జింగ్

ధరలు:

4GB RAM+128GB స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్ కలిగిన వేరియంట్ ధర: రూ. 11,999/-

6GB RAM+128GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర: రూ. 13,999/-

6GB RAM+128GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర: రూ. 14,999/-

ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అయితే, విక్రయాలు ప్రారంభమయ్యే తేదీని కంపెనీ ఇంకా ధృవీకరించనప్పటికీ, ఏప్రిల్ 2న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల IST వరకు ఎర్లీ బర్డ్ సేల్‌కు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.