Jio,Samsung 5G: 5జీ టెక్నాలజీని తీసుకువచ్చేందుకు శాంసంగ్, జియో కసరత్తు, ఈ ఏడాది ప్రారంభం కాబోతున్న 5జీ వేలం, వెల్లడించిన కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌, 3 రోజుల పాటు జరగనున్న ఐఎంసీ 2019 ఈవెంట్
Reliance-jio-and-samsung-showcase-5g-and-lte-use-cases-at-imc-2019 (Photo-Twitter)

New Delhi, October 15: ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) (India Mobile Congress) 2019 వేడుకల ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్ని టెక్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో 4జీతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన 5జీ టెక్నాలజీని పరిచయం చేసింది. భవిష్యత్ 5జీ ప్రణాళికల్ని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ వరల్డ్ లో ప్రపంచానికి పరిచయం చేసింది. కాగా రిలయన్స్‌ జియో, శాంసంగ్‌లు నెక్ట్స్‌ జనరేషన్‌ టెక్నాలజీతో కూడిన 5జీ, ఎల్‌టీఈ మోడల్స్‌ను ప్రదర్శించాయి. ఈ సంధర్భంగా 5జీ స్పెక్ట్రమ్ సమయానికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రిలయెన్స్ జియో కోరింది. 5జీ ధరలపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలని రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డ్ మెంబర్ మహేంద్ర నహత కోరారు.శాంసంగ్‌ నెట్‌వర్క్‌ భాగస్వామ్యంతో జియో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌, 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను నిర్మించింది.

ఈ ఈవెంట్లో దిగ్గజ కంపెనీలు రెండు 5జీ ఎన్‌ఎస్‌ఏ విధానం వాడటం ద్వారా నూతన వ్యాపార అవకాశాల గురించి వివరించాయి. 4జీ ఎల్‌టీఈ, 5జీ టెక్నాలజీని మిళితం చేయడం ద్వారా వినియోగదారులకు ఎలాంటి వినూత్న సేవలు అందించవచ్చో వివరించాయి. మొబైల్‌ ఇంటర్‌నెట్‌, నిరంతరం డేటా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వినియోగదారుల జీవితంలో సమూల మార్పులు తీసుకువచ్చామని ఈ సందర్భంగా రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ప్రెసిడెంట్‌ మ్యాథ్యూ ఊమెన్‌ పేర్కొన్నారు. ఇక 5జీలోకి మారే ప్రక్రియలో అత్యున్నత ఎల్‌టీఈ నెట్‌వర్క్‌లు కీలకమని శాంసంగ్‌ నెట్‌వర్క్స్‌ బిజినెస్‌ హెడ్‌ పాల్‌ కుంగ్‌వున్‌ చెన్‌ పేర్కొన్నారు. దక్షిణాసియా, భారత్‌లోనే అతిపెద్ద డిజిటల్‌ సాంకేతికత ఈవెంట్‌గా పేరొందిన ఐఎంసీ ఈనెల 14 నుంచి 16 వరకూ ఢిల్లీలో ఘనంగా జరగుతున్నాయి

5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రం వేలాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిర్వహించనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. స్పెక్ట్రం ధరలకు సంబంధించి సంస్కరణలు ఉంటాయని టెలికం పరిశ్రమకు హామీ ఇచ్చారు. ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2019 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.