 
                                                                 Mumbai,November 29: దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో(Reliance Jio) యూజర్ల కోసం మరో బంపరాఫర్ ను తీసుకువచ్చింది. ఇకపై సన్ గ్రూప్‌కు చెందిన సన్ నెక్ట్స్(Sun Nxt) ప్లాట్‌ఫాంలోని కంటెంట్(sun nxt content)ను జియో సినిమా యాప్‌లో జియో వినియోగదారులు ఉచితం(Reliance Jio Free Offer)గా వీక్షించవచ్చు. ఈ మేరకు జియో, సన్ గ్రూప్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.
ఇకపై సన్ కంటెంట్‌ను జియో వినియోగదారులు తమ ఫోన్‌లోని జియో సినిమా యాప్(Jio Cinema App)లో వీక్షించవచ్చని జియో తెలిపింది. కాగా ఇప్పటికే డిస్నీ సంస్థతో చేసుకున్న ఒప్పందం కారణంగా జియో సినిమా యాప్‌లో డిస్నీ కంటెంట్‌ను కూడా చూసేందుకు వీలు కలుగుతోంది. ఈ క్రమంలో జియో సినిమా యాప్ అటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌తోపాటు వొడాఫోన్ ప్లే యాప్‌లకు గట్టి పోటీనివ్వనుంది.
ఇప్పటికే టారిఫ్ రేట్లు పెంచి ఇంటా బయటా అన్ని వైపులా విమర్శలు మూటగట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చడీచప్పుడూ లేకుండా మరో నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతి పెద్ద టీవీ నెట్ వర్క్ ల్లో ఒకటైన సన్ గ్రూపు ఓటీటీ ప్లాట్ ఫాం సన్ నెక్స్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.దీని ద్వారా దేశంలోని వివిధ భాషలకు చెందిన సినిమాలు ఉచితంగా చూడవచ్చు.
ఎలా చూడాలి ?
ముందుగా మీ మొబైల్ నుంచి జియో సినిమా యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని అందులో లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మీకు జియో సినిమా, డిస్నీ జియో అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో జియో సినిమాను ఎంచుకోవాలి. జియో సినిమాలోకి వెళ్లాక ఎడమవైపు పైభాగంలో మూడు గీతల ఐకాన్ కనిపిస్తుంది.దాని మీద క్లిక్ చేస్తే అందులో మీకు Sun NXT అని ప్రత్యేక పేజీ కనిపిస్తుంది. అందులోకి వెళ్తే సన్ నెక్స్ట్ కంటెంట్ అంతా మీకు కనిపిస్తుంది. మీకు నచ్చినవి సెలక్ట్ చేసుకుని చూడవచ్చు. అలాగే డిస్నీ ఫీచర్ ను ఎంచుకుంటే ఎంచుకుంటే జియో సినిమా యాప్ లో ఉండే హాలీవుడ్ సినిమాలను చూడవచ్చు
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
