Jio Independence Offer: ఇండిపెండెన్స్ డే సందర్భంగా జియో యూజర్లకు బంపరాఫర్, కొత్త ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడితో లభించే బెనిఫిట్లు ఓ సారి తెలుసుకోండి
Representational image (photo credit- ANI)

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో తన యూజర్లకు సరికొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.2,999 చెల్లిస్తే రోజువారీగా 2.5 జీబీ డేటాతోపాటు అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్లు పొందొచ్చు. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి జియో యాప్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. రూ.2,999 ప్రీ-పెయిడ్ ఇండిపెండెన్స్ ఆఫర్ 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. రూ.249తో స్విగ్గీ ఆర్డర్ పెడితే రూ.2,999 ప్రీ-పెయిడ్ ప్లాన్‌లో రూ.100 తగ్గుతుంది. దీంతో పాటుగా మరో ప్లాన్ రూ.2,545లతో 336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కూడా తెచ్చింది.

రూ.2,999 ప్లాన్

రిలయన్స్ జియో వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల మేరకు రూ.2,999 ప్లాన్ కింద 365 రోజులూ.. డైలీ 2.5 జీబీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ యాప్స్ ఉచితంగా పొందడంతోపాటు 5జీ డేటా అపరిమితంగా అందుకోవచ్చు. రూ.249 స్విగ్గీ ఆర్డర్‌ చేస్తే.. రూ.2999 ప్లాన్‌లో రూ.100 మాఫీ, యాత్ర వెబ్‌సైట్ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసుకుంటే రూ.1500 వరకు, అజియోలో సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ రూ.999 పై చిలుకు వస్తువులు కొనుగోలు చేస్తే రూ.200 డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా నెట్ మెడ్స్ లో ఆర్డర్లపై 20 శాతం రాయితీ అందుకోవచ్చు.

యూపీఐ లైట్‌ లిమిట్‌ రూ. 500 పెంపు, పాస్‌వర్డ్‌ అవసరం లేకుంగా మీరు ఇకపై 500 వరకు పేమెంట్ చేసుకోవచ్చు

రూ.2,545 ప్రీ పెయిడ్ ప్లాన్

336 రోజుల వ్యాలిడిటీ గల రూ.2,545 ప్రీ పెయిడ్ ప్లాన్ కింద ప్రతి రోజూ 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి యాప్స్ ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అర్హత గల సబ్ స్క్రైబర్లకు అపరిమిత 5జీ డేటా ఉచితం.

రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్

30 రోజుల వ్యాలిడిటీ మాత్రమే కలిగి ఉంటుంది. 75 జీబీ హైస్పీడ్ డేటా పొందొచ్చు. డేటా పరిమితి దాటితే 64 కేబీపీఎస్ స్పీడ్ తో డేటా లభిస్తుంది. ఆసక్తి గల రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్లు.. మై జియో యాప్, జియో వెబ్ సైట్ తోపాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర మొబైల్ యాప్స్ ద్వారా ఈ ప్లాన్ల కింద రీచార్జి చేసుకోవచ్చు.