Reliance Jio (photo-ANI)

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. 90 రోజుల వ్యాలిడిటీతో రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో సాధారణ ఆఫర్లతో పోల్చితే యూజర్లకు అధిక డేటా లభిస్తోంది. ఆఫర్‌లో రోజుకు 2జీబీతో పాటు అదనంగా మరో 20 జీబీ డేటాను జియో అందిస్తోంది. మొత్తం 200 జీబీల డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఉచిత కాలింగ్, ఎంఎస్‌ఎంలు, ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ తొలగించమని బలవంతం చేస్తే భారత్ నుంచి వెళ్లిపోతాం, ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన వాట్సాప్

ఇక ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటాను వినియోగించుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. 5జీ మొబైల్ కలిగివుండి కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ యాక్సెస్ ఉంటే అదనపు డేటాను వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఆఫర్ కింద జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌లకు సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 90 రోజులపాటు ఈ సేవలను పొందవచ్చు. భారత్‌లో అత్యధికంగా 45 కోట్లకు పైగా క్రియాశీల కస్టమర్లను జియో కలిగివుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్‌గా జియో కొనసాగుతోంది.