Jio stops offering its Jio Fiber Preview offer to new users | (Photo credit: Archived, edited, symbolic image)

దసరా సందర్భంగా జియో బంఫరాపర్లతో ముందుకొచ్చింది. రెండు ప్లాన్లపై అదనపు తగ్గింపు ఆఫర్లతో పాటు బోలెడు బెనిఫిట్స్‌ కూడా అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్. జియో కస్టమర్లకు ప్రకటించిన ఈ ఫెస్టివల్‌ బొనాంజాలో ఏకంగా రూ. 4,500 వరకు బెనిఫిట్స్‌ సొంతం చేసుకోవచ్చు. జియో ఫైబర్‌కు చెందిన రెండు పోస్ట్‌ పెయిడ్ ప్లాన్స్‌ తన కొత్త కస్టమర్ల కోసం రూ. 599, రూ. 899 ప్లాన్లపై ఈ ఆఫర్లును జత చేసింది. ఈ ఆఫర్ అక్టోబర్ 9 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. JioFiber ప్రకటించిన ఫెస్టివల్ ఆఫర్లపై ఓ లుక్కేద్దాం..

JioFiber ₹599 ప్లాన్‌

ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 30 Mbps డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌తో అపరిమిత డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో సోనీలివ్‌( SonyLIV), డిస్నీ+ హాట్‌స్టార్‌ ( Disney+ Hotstar), వూట్‌ సెలెక్ట్‌( Voot Select)తో పాటు మరిన్నింటికి సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ జియో.కామ్‌, (Jio.com), మై జియో (MyJio) యాప్‌లో అందుబాటులో ఉంది.

ఈ ప్లాన్‌ కింద బెనిఫిట్స్‌

►రిలయన్స్ డిజిటల్‌లో ₹1000 తగ్గింపు

►Myntra లో ₹1000 తగ్గింపు, Ajioలో ₹1000 తగ్గింపు

►ఇక్సిగోలో ₹1500 తగ్గింపు.

రూ.15 వేలకే 4జీ సిమ్ ఇన్‌ బిల్ట్‌గా జియా ల్యాప్‌టాప్, మరో సంచలనానికి రెడీ అవుతున్న ముకేష్ అంబానీ, రెండు మూడు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం

JioFiber ₹899 ప్లాన్‌

ఈ ప్లాన్‌లో 100 Mbps డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్‌ డేటా ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటు సోనీలివ్‌( SonyLIV), డిస్నీ+ హాట్‌స్టార్‌ ( Disney+ Hotstar), వూట్‌ సెలెక్ట్‌( Voot Select)తో పాటు మరిన్నింటికి సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ జియో.కామ్‌, (Jio.com), మై జియో (MyJio) యాప్‌లో అందుబాటులో ఉంది.

ఈ ప్లాన్‌ కింద బెనిఫిట్స్‌

►రిలయన్స్ డిజిటల్‌లో ₹500 తగ్గింపు

► Myntraలో ₹500 తగ్గింపు

►Ajioలో ₹1000 తగ్గింపు

►ఇక్సిగోలో ₹1500 తగ్గింపు.

అయితే జియో ఫైబర్‌ కొత్త కస్టమర్ కనీసం 3 నెలల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి.