Reliance Jio’s new All-in-One plans launched-Here all details (Photo-Ians)

October 21: రిలయన్స్ జియో ఎట్టకేలకు దిగివచ్చింది. ఐయూసీ కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామంటూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై జియో మొబైల్ వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పైగా, ప్రత్యర్థి కంపెనీలు ఏవీ కూడా ఈ తరహా ఐయూసీ చార్జీల వసూలుకు ఆసక్తి చూపలేదు. దీంతో రిలయన్స్ జియో దిగి కిందకు దిగివచ్చింది. కస్టమర్లకు మూడు సరికొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ పేరుతో దీన్ని పరిచయం చేసింది. నెలకు రూ.222, రెండు నెలలకు రూ.333, మూడు నెలలకు రూ.444 చొప్పున ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ మూడు ప్లాన్లలో రోజుకు 2 జీబీ డేటా లభిస్తోంది.

ఈ ప్లాన్లలో విశేషం ఏటంటే జియోయేతర మొబైల్‌ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్‌ చేస్తోంది. దీంతోపాటు ఎప్పటిలాగే జియో టు జియో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం కల్పించింది. కాగా తమ కొత్త ప్లాన్స్‌ ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే మార్కెట్లో కనీసం 20-50 వరకు వరకు చౌకగా ఉన్నాయని జియో ఒక ప్రకటనలో తెలిపింది.

నెలకు రూ.222తో చేసే ప్లాన్‌తో రోజుకు 2జీబీ డేటా, జియో టు జియోకు అన్ లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాలింగ్స్, ఇతర నెట్‌వర్క్‌లకు వెయ్యి నిమిషాల టాక్ టైం. అలాగే రూ.333తో రీఛార్జ్ చేయిస్తే ఇదే ఆఫర్లు 2నెలల వ్యాలిడిటీ ఉంటాయి. ఇలా రూ.111పెంచుకుంటూ పోయిన కొలదీ ఒక్కో నెల వ్యాలిడిటీ పెరుగుతూ ఉంటుంది. గతంలో 1.5జీబీ ప్యాక్ డేటాతో ఉన్న యూజర్లకు ఇదే ఆఫర్లతో కొత్త ప్యాక్ కావాలంటే అదనంగా రూ.80తో రీఛార్జ్ చేయించుకుంటే సరిపోతుంది.

కాగా ఇంటర్‌కనెక్ట్ యూజర్‌ ఛార్జీ పేరుతో నిమిషానికి రూ. 6 పైసల వసూలును ఇటీవల జియో ప్రకటించింది. అలాగే ఒక రోజు వాలిడిటీ ఉన్న రూ.19 ప్లాన్‌ను, 7రోజుల వాలిడిటీ రూ. 52ప్లాన్‌ను తొలగించింది. దీనిపై వినియోగదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కాగా, అటు ప్రత్యర్థి కంపెనీ వొడాఫోన్‌ స్పందిస్తూ తాము ఎలాంటి ఐయూసీ చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసింది.