Reliance-GIC,TPG Deal: రిలయన్స్‌లోకి తాజాగా రూ.7,350 కోట్లు పెట్టుబడులు, రిలయన్స్ రిటైల్ విభాగంలో ఈ మొత్తాన్ని పెట్టనున్నట్లు తెలిపిన జీఐసీ, టీపీజీ సంస్థలు, రూ.32,197.50 కోట్లకు చేరిన రిలయన్స్ మొత్తం పెట్టుబడులు
Forbes Billionaire List 2018 Has Declared

జియో అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా రిలయన్స్ రిటైల్ విభాగంలో (Reliance Retail Ventures Ltd (RRVL) రూ.7,350 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ సంస్థ జీఐసీ, గ్లోబల్ ప్రయివేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ కాపిటల్ (Reliance-GIC,TPG Deal) అంగీకరించినట్టు ఆర్ఐఎల్ ప్రకటించింది. ఈ పెట్టుబడులతో కేవలం నెల రోజుల్లో వివిధ అంతర్జాతీయ దిగ్గజాల నుంచి రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్‌వీఎల్) సమీకరించిన పెట్టుబడుల మొత్తం రూ.32,197.50 కోట్లకు చేరింది.

ఆర్ఆర్‌వీఎల్‌లో 1.22 వాటా కోసం జీఐసీ రూ. 5,512.5 కోట్లు పెట్టుబడితో ముందుకురాగా.. టీపీజీ రూ.1, 837.5 కోట్లతో రూ 0.41 శాతం వాటా కొనుగోలు చేసినట్టు ఆర్ఐఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజా ఒప్పందాలతో రిలయన్స్ వెంచర్స్‌లో పెట్టుబడుల విలువ రూ. 4.285 లక్షలకు చేరింది. ఆర్ఐఎల్ అనుబంధ సంస్థల్లో టీపీజీ పెట్టుబడులు పెట్టడం ఇది రెండోసారి. ఇంతకు ముందు రిలయన్స్ ఇండస్టీస్ డిజిటల్ విభాగం జియో ఫ్లాట్‌పామ్స్‌లో టీపీజీ రూ. 4,546.8 కోట్లు పెట్టుబడి పెట్టింది.

గుడ్ న్యూస్..రూ.2 కోట్ల లోపు రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం, పలు రుణ గ్రహీతలకు భారీ ఊరట

కాగా గత నెల 9 నుంచి ఇప్పటి వరకు తన రిటైల్ విభాగంలో 7.28 శాతం వాటా విక్రయించిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. పెట్టుబడుల రూపంలో రూ.32,297.50 కోట్లు సమీకరించింది. అమెరికాకి చెందిన ప్రయివేటు ఈక్విటీ సంస్థ రిలయన్స్ రిటైల్‌లో 2.13 శాతం వాటా కోసం రూ. 9,375 కోట్ల మేర రెండు సార్లు పెట్టుబడి పెట్టగా.. జనరల్ అట్లాంటిక్ రూ.3,675 కోట్లతో 0.84 శాతం, కేకేఆర్ సంస్థ రూ.5,550 కోట్లతో 1.28 శాతం వాటాలను సొంతం చేసుకున్నాయి. అబూదాబీకి చెందిన ముబదలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ 1.4 శాతం వాటా కోసం రూ. 6,247.5 కోట్లు పెట్టుబడి పెట్టింది.

జీఐసీ రూ .5,512.5 కోట్లు, టీపీజీ 1,837.5 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. ఆర్‌ఆర్‌విఎల్‌లో వరుసగా 1.22 శాతం, 0.41 శాతం ఈక్విటీ వాటాను ఈ రెండు సంస్థలు సొంతం చేసుకోనున్నాయి. జియో తరువాత వరుస పెట్టుబడులతో దూసుకుపోతున్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లో ఇవి వరుసగా ఆరో, ఏడు పెట్టుబడుల ఒప్పందాలు కావడం విశేషం.

జీఐసీ ప్రపంచ నెట్‌వర్క్, దీర్ఘకాలిక భాగస్వామ్యాలు భారత రిటైల్ వ్యవస్థను మెరుగుపరుస్తూ, మరింతగా మారుస్తాయని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్ తన సప్లై చైన్‌, స్టోర్ నెట్‌వర్క్స్, లాజిస్టిక్స్, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కొనసాగిస్తూ కస్టమర్లు, వాటాదారులకు మరింత ప్రయోజనం కలగనుందని జీఐసీ సీఈఓ లిమ చౌ కియాత్ తెలిపారు.