Mukesh Ambani (Photo-ANI)

రిలయన్స్ జియో వినియోగదారులకు ముఖేష్ అంబానీ శుభవార్తను చెప్పారు. సెప్టెంబర్‌ 19న వినాయక చవితి సందర్భంగా ఎయిర్‌ఫైబర్‌ను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్‌, జియో 5జీ గురించి జియో అధినేత ఈ కీలక ప్రకటన చేశారు.

జియో ఎయిర్‌ఫైబర్‌ డివైజ్‌ సాయంతో వైఫై తరహాలో ఎటువంటి వైర్లు లేకుండా ఇంట్లో 5జీ ఇంటర్నెట్‌, హాట్‌స్పాట్‌ వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్‌ఫైబర్‌ డివైజ్‌ను ఆఫ్‌, ఆన్‌ చేస్తే సరిపోతుంది. అలాగే ఇంట్లో, ఆఫీస్‌లో గిగాబైట్‌ (సెకనుకు వెయ్యి మెగాబైట్స్‌) స్పీడ్‌‌తో ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.

జియో ఎయిర్‌ఫైబర్‌ ఉపయోగంలో కేబుల్స్‌తో పని ఉండదు. ఇదో సింగిల్‌ డివైజ్‌. దగ్గర్లోని జియో టవర్స్‌ నుంచి వీటికి సిగ్నల్స్‌ అందుతాయి. ఇంట్లో జియోఫైబర్‌తో పిల్లలు వినియోగించే యాప్స్‌, వెబ్‌సైట్స్‌ను కుటుంబసభ్యులు కంట్రోల్‌ చేయొచ్చు. సంబంధిత వెబ్‌సైట్లను, యాప్స్‌ను ఎలాంటి టెక్నీషియన్‌ అవసరం లేకుండా బ్లాక్‌ చేసే సౌలభ్యం ఉన్నట్లు పేర్కొంది. అలాగే 5జీ నెట్‌వర్క్‌తో 1.5జీబీపీఎస్‌ స్పీడ్‌ పొందవచ్చని తెలిపింది.

మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్‌ అంటూ ఇలా మెజేస్ వస్తే కంగారు పడకండి, కేంద్రమే ఆ సందేశాన్ని ఎందుకు పంపిందో తెలుసుకోండి

జియో ఎయిర్‌ఫైబర్‌ పోర్టబుల్ రూటర్లను (జియోఫై ఎం2ఎస్‌) రూ. 2,800కి, మెష్ ఎక్స్‌టెండర్ (వైఫై ధర రూ. 2,499), జియో ఎక్స్‌టెండర్‌ 6 మెష్‌ వైఫై సిస్టం ధర రూ. 9,999గా నిర్ణయించినట్లుగా నివేదికలు వెలువడుతున్నాయి. రానున్ సరి కొత్త వైర్‌లెస్ రూటర్ ధర రూ. 10,000 ఉంటుందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక జియో ఎయిర్‌ ఫైబర్‌ ధర ఎంతనేది అధికారంగా వెల్లడించాల్సి ఉంటుంది.