RIL AGM 2022: జియో మరో సంచలనం, గిగా బైట్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌తో ఇళ్లకు కనెక్ట్ అయ్యే విధంగా జియో ఎయిర్‌ ఫైబర్‌ డివైజ్, దీపావళి నుంచి 5జీ సేవలు అందుబాటులోకి
Mukesh Ambani (Photo Credits: Youtube)

రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ నేతృత్వంలో రిలయన్స్‌ వార్షిక సమావేశం (AGM) కొనసాగుతుంది. ఈ సందర్భంగా రిలయన్స్‌ సంస్థ 5జీ నెట్‌ వర్క్‌తో (Jio 5G Services Roll Out) పాటు ఇతర సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు అంబానీ ప్రకటించారు. ఏజీఎం సమావేశంలో జియో 5జీ నెట్‌ వర్క్‌ను ఈ దీపావళి నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ముఖేష్‌ అంబానీ ప్రకటించారు.

ఇక పర్సనల్‌ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్స్‌ను అప్‌ గ్రేడ్‌ చేసుకునే అవసరం లేకుండా రిలయన్స్‌ జియో క్లౌడ్‌ పీసీ అనే కొత్త ప్రొడక్టన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు రిలయన్స్‌ సంచలన ప్రకటన చేసింది.జియో 5జీ సేవల్లో ఒక భాగమైన జియో ఫైబర్‌ను ఉపయోగించి క్లౌండ్‌ ఉంచిన వర్చువల్‌ పీసీని వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. వినియోగం బట్టి ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా టెక్నాలజీని రిలయన్స్‌ సంస్థలో ఉపయోగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

రూ. 2 లక్షల కోట్ల ఖర్చుతో జియో 5జీ నెట్‌వర్క్, డిసెంబర్‌ 2023 నాటికల్లా దేశంలో ప్రతి గ్రామానికి 5జీ సేవలు,దివాళీకి ఈ నగరాల్లో 5జీ సేవలు

జియో సంస్థ 'జియో ఎయిర్‌ ఫైబర్‌' (Jio AIRFIBER) అనే డివైజ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు రిలయన్స్‌ ప్రకటించింది. ఈ సింగిల్‌ డివైజ్‌తో సులభంగా ఇంట్లో వైఫై హాట్‌ స్పాట్‌, ఆల్ట్రా హై స్పీడ్‌ 5జీ నెట్‌ వర్క్‌ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. అతి తక్కువ సమయంలో గిగా బైట్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌తో (Enable Ultra-speed 5G Connectivity in Homes and Offices

) వందల సంఖ్యలో ఇళ్లు, కార్యాలయాల్లో కనెక్ట్‌ అవుతుందని తెలిపింది.