RTGS Payment Update: బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్, ఆర్టీజీఎస్‌ సేవలు 24 గంటల పాటు అందుబాటులో.., డిసెంబర్ నుంచి అమల్లోకి, వివరాలను వెల్లడించిన ఆర్‌బీఐ
The Reserve Bank of India (RBI) |

బ్యాంకు ఖాతాదారులకు ఆర్ బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. నగదు బదిలీ సౌకర్యం రియల్‌టైం గ్రాస్‌ సెటిల్మెంట్‌ (RTGS) (RTGS payment system) వారంలో ప్రతి రోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ (RBI) శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని కేంద్ర బ్యాంక్‌ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నెలలో రెండు, నాలుగు శనివారాలు, ఆదివారం మినహా మిగిలిన అన్ని వర్కింగ్‌ డేస్‌లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మనీ ట్రాన్స్‌ఫర్స్‌ (RTGS Fund Transfer System) అందుబాటులో ఉన్నాయి.

2019 డిసెంబర్‌ నుంచి నెఫ్ట్‌ సదుపాయాన్ని ఆర్బీఐ నిరంతరం అందుబాటులోకి తీసుకువచ్చిన క్రమంలో ఈ తాజా ప్రకటన వెలువడింది. నెఫ్ట్‌ వ్యవస్థను (NEFT System) గత ఏడాది డిసెంబర్‌ నుంచి 24x7 అందుబాటులోకి తీసుకువచ్చినప్పటి నుంచి సాఫీగా సాగుతోందని, ఈ నేపథ్యంలో ఇక పెద్ద మొత్తాల బదిలీకి ఉద్దేశించిన ఆర్టీజీఎస్‌ సిస్టం సైతం ఇప్పుడు కస్టమర్లకు వారంలో అన్ని రోజులూ, 24 గంటల పాటు ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ ప్రకటన పేర్కొంది.

వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం, రుణ మారటోరియం పరిధిని పొడిగించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, ఆర్‌బీఐ

ఆర్టీజీఎస్‌ కింద రూ 2 లక్షల నుంచి గరిష్టంగా ఎంత మొత్తమైనా ఒక బ్యాంక్‌ ఖాతా నుంచి మరో బ్యాంక్‌ ఖాతాకు బదలాయించవచ్చు. అయితే ఆర్టీజీఎస్‌ ద్వారా పంపే నగదుపై గరిష్ట పరిమతి లేకున్నా పలు బ్యాంకులు రూ 10 లక్షలను గరిష్ట మొత్తంగా పరిమితి విధించాయి