Samsung Galaxy A15 5G | Pic: Samsung official

Samsung Galaxy A15 5G : దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్- టెక్నాలజీ సంస్థ సామ్‌సంగ్ తాజాగా Galaxy A15 5G మోడల్ స్మార్ట్‌ఫోన్‌కు మరొక కొత్త స్టోరేజ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Galaxy A15 స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు 6GB RAM +128GB స్టోరేజ్‌లో కూడా లభ్యం అవుతోంది. ఈ కొత్త వేరియంట్‌తో, Galaxy A15 5G ఇప్పుడు మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే, ఫోన్ బ్లూ-బ్లాక్, బ్లూ మరియు లైట్ బ్లూ అనే మూడు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

గత ఏడాది డిసెంబర్‌లో ఫోన్ లాంచ్ అయినప్పటి నుండి 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ధర రూ. 19,499, అలాగే 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 22,499గా ఉంది. అయితే అద్భుతమైన పనితీరు కలిగిన ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటు ధరలో అందించేందుకు సామ్‌సంగ్ కంపెనీ 6GB RAM +128GB వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు రూ. 16,499/- ధరకు లభించనుంది.

మరి ఈ సరికొత్త వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, మొదలైన విషయాలను ఈ కింద తెలుసుకోండి.

Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5-అంగుళాల  ఫుల్‌హెచ్‌డి+ సూపర్ AMOLED డిస్‌ప్లే
  • 6GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+5MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌, ముందు భాగంలో 13MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌
  • ధర: రూ. 16,499/-

Galaxy A15 5Gలోని కనెక్టివిటీ కోసం.. 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్‌లు, గైరో సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.