Samsung Galaxy A55 and Galaxy A35: Photo- Official Website

Samsung Galaxy A55 and Galaxy A35: స్మార్ట్‌ఫోన్‌ మేకర్ సామ్‌సంగ్ కొంతకాలంగా ప్రచారం చేస్తూ వస్తున్న మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ A55 మరియు గెలాక్సీ A35 అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ ఆవిష్కరించింది. ఈ రెండు మోడళ్లకు 4 సంవత్సరాల OS అప్‌డేట్‌లను, 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లను సామ్‌సంగ్ అందించనుంది.

కాగా, తాజాగా విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ A55, సామ్‌సంగ్ గెలాక్సీ A35 స్మార్ట్‌ఫోన్‌లు కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్లలో అసాధారణమైన పనితీరును కనబరిచే Exynos ప్రాసెసర్ అమర్చబడి ఉంటుంది. అదేవిధంగా ఈ ఫోన్లు Android 14 ఆధారంగా Samsung యొక్క One UI 6.1పై పనిచేస్తాయి. ఫోటోగ్రఫీ కోసం, AI ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ (ISP) సిస్టమ్, స్పష్టమైన వీక్షణ కోసం AMOLED స్కీన్, దానిపై గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కవచం అందిస్తున్నారు.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. అయితే వీటి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు ఎలా ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.

Samsung Galaxy A55 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6-అంగుళాల ఫుల్‌హెచ్‌డి+ సూపర్ AMOLED డిస్‌ప్లే
  • 8GB/ 12GB RAM, 128GB/ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+12MP+5MP ట్రిపుల్ కెమెరా సెటప్‌, ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం,  25W ఫాస్ట్ ఛార్జింగ్‌

Samsung Galaxy A55 కంటే Samsung Galaxy A35 కాస్త తక్కువ పనితీరును కనబరుస్తుంది. అయితే ఫీచర్ల పరంగా దాదాపు సమానంగానే ఉంటుంది, ఆ వివరాలు ఈ కింద చూడండి.

Samsung Galaxy A35 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5-అంగుళాల ఫుల్‌హెచ్‌డి+ సూపర్ AMOLED డిస్‌ప్లే
  • 6GB/ 8GB RAM, 128GB/ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+5MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌, ముందు భాగంలో 13MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం,  25W ఫాస్ట్ ఛార్జింగ్‌

అయితే, సామ్‌సంగ్ కంపెనీ ఇప్పటికీ ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ధరలను ప్రకటించలేదు, మార్చి 14న వెల్లడించే అవకాశం ఉంది. మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం, గెలాక్సీ ఏ35 సుమారు రూ. 22 వేలు, అలాగే గెలాక్సీ ఏ55 రూ. 29 వేల ధరల శ్రేణిలో ఉండవచ్చునని అంచనాలు ఉన్నాయి.