October 7: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ప్రపంచ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతుంది. తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ ద్వారా హైఎండ్ మార్కెట్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో బుకింగ్‌కు రాగా కేవలం 30 నిమిషాల్లోనే బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి. ఈ సక్సెస్ తో శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ 2ని కూడా మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రానున్న శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 ఎస్ పెన్సిల్ ఫీచర్ తో రానున్నట్లు తెలుస్తోంది. గెలాక్సీ ఫోల్డ్ కన్నా స్టైలిష్ లుక్ తో ఇది మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. శాంసంగ్ ఇప్పటికే దీని మీద పేటెంట్ తీసుకున్నట్లుగా ప్రముఖ టెక్ వెబ్‌సైట్ లెట్స్‌గో డిజిటల్ తెలిపింది. ఈ సైట్ పొందుపరిచిన వివరాల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ సీరిస్ లో మరొక ఫోన్ తీసుకురానుందని తెలిపింది. అది గెలాక్సీ ఫోల్డ్ 2 కావొచ్చని తెలిపింది.
ఇదిలా ఉంటే ఇండియన్ మార్కెట్లోకి దూసుకువచ్చిన శాంసంగ్ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ విక్రయాల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రీ బుకింగ్‌లు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి. అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-బుకింగ్‌లు మొదలు పెట్టిన 30 నిమిషాల వ్యవధిలో మొత్తం 1,600 యూనిట్ల గెలాక్సీ ఫోల్డ్ ప్రీమియం ఫోన్‌లను కంపెనీ విక్రయించింది. అనుకున్న దాని కన్నా బుకింగ్స్ ఎక్కువ కావడంతో ప్రీ-బుకింగ్స్‌ను మూసివేసింది. వార్తా సంస్థ ఐఎఎన్‌ఎస్ అందించిన నివేదిక ప్రకారం, ఫోన్‌లను ముందే బుక్ చేసుకున్న కొనుగోలుదారులు మొత్తం రూ. 1,64,999 ముందస్తుగా చెల్లించి మరీ వీటిని సొంతం చేసుకున్నారు. ఈ నెల 20న ఈ ఫోన్ వినియోగదారుల చేతికి రానుంది.
శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ గెలాక్సీ ఫోల్డ్ మొత్తం 6 కెమెరాలతో వస్తోంది. సాధారణంగా4.6-అంగుళాల సింగిల్ ఫోల్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉండగా దీన్ని విప్పినప్పుడు అది 7.3 అంగుళాల వరకు విచ్చుకుంటుంది. ఇక స్క్రీన్ 840x1960 రిజల్యూషన్ కాగా , మరో స్క్రీన్ 1,536 x 2,152 రిజల్యూషన్ కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు
స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 7.3 ఇంచుల ఇన్పినిటీ ఫ్లెక్స్ డైనమిక్ అమోలెడ్ డిస్ ప్లే, 4.6 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, 4380 ఎంఏహెచ్, వెనుక భాగంలో 16, 12, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 10 మెగాపిక్సల్ కవర్ కెమెరా, ఆండ్రాయిడ్ పై 9.0 ఓఎస్. ఒకేసారి మూడు యాప్ లను ఈ ఫోన్ డిస్‌ప్లేలపై రన్ చేసుకోవచ్చు. అలాగే వాట్సప్, యూట్యూబ్ తదితర సోషల్ యాప్స్‌ను ఇందులో ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఫోన్ కోసమే ప్రత్యేకంగా ఈ యాప్‌లను భిన్న రకాల్లో డిజైన్ చేశారు.