Samsung Galaxy M14 4G Smartphone: సామ్‌సంగ్ కంపెనీ వరుస పెట్టి వివిధ స్మార్ట్‌ఫోన్ మోడళ్లను విడుదల చేస్తుంది, ఇటీవలే Galaxy F15 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయగా, తాజాగా గెలాక్సీ M14 స్మార్ట్‌ఫోన్ యొక్క 4G వేరియంట్‌ను నిశ్శబ్దంగా విడుదల చేసింది. 'సామ్‌సంగ్ గెలాక్సీ ఎం14 4G' ను కంపెనీ ఇప్పుడు ఆన్‌లైన్ విక్రయాల కోసం అమెజాన్‌లో జాబితా చేసింది. కాగా, ఈ గెలాక్సీ ఎం14 4G అనేది గతేడాది విడుదల చేసిన 5G వేరియంట్‌కు దిగువ స్థాయి మోడల్. దీని ధర కూడా తక్కువే, ఇది మీకు 9 వేల లోపు బడ్జెట్‌లోనే లభిస్తుంది. అందుకు తగినట్లుగానే ఫీచర్లు ఉంటాయి. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లో 5G కనెక్టివిటీ కూడా లేదు. అయినప్పటికీ, ఇది శక్తివంతమైన క్వాల్‌కామ్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. మిగతా ఫీచర్లు యధాతథంగా ఉంటాయి.
Samsung Galaxy M14 4G రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ ఆర్కిటిక్ బ్లూ మరియు సఫైర్ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏ విధంగా ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద పరిశీలించండి.
Samsung Galaxy M14 4G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7-అంగుళాల పూర్తి-HD+ LCD స్క్రీన్
- 4GB/ 6GB RAM, 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 13MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఫాస్ట్ ఛార్జింగ్
ధరలు: 4GB RAM+64GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 8,499/-
GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ రూ 11,499/-
ఈ ఫోన్ రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లను అలాగే నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లను పొందుతుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం Samsung Galaxy M14 4G అమెజాన్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.