Samsung Galaxy M15 5G: దక్షిణ కొరియా టెక్ బ్రాండ్ సామ్‌సంగ్ నిశ్శబ్దంగా 'గెలాక్సీ M15 5G' అనే స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి పలు కీలకాంశాలను పరిశీలిస్తే, ఇది వాటర్-డ్రాప్-స్టైల్ డిస్‌ప్లే డిజైన్ కలిగి ఉంది, అలాగే భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ లైట్ బ్లూ, డార్క్ బ్లూ మరియు గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Galaxy M-సిరీస్‌లో భాగమైన ఈ పరికరం, ఆక్టా-కోర్ చిప్‌సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇది ఆకట్టుకునే 50MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్‌లో శక్తివంతమైన 6,000mAh బ్యాటరీని ఇచ్చారు, ఇది ఫుల్ ఛార్జ్‌పై గరిష్టంగా 21 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని, అలాగే 128 గంటల వరకు ఆడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది.
అయితే, ఈ ఫీచర్లను పరిశీలిస్తే ఈ Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ అనేది గతంలో కంపెనీ విడుదల చేసిన Galaxy A15 స్మార్ట్‌ఫోన్ మోడల్‌కు రీబ్రాండ్ వెర్షన్ లాగా అనిపిస్తుంది. మరి ఈ స్మార్ట్‌ఫోన్‌లో అదనంగా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత మొదలైన విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5-అంగుళాల ఫుల్‌హెచ్‌డి+ సూపర్ AMOLED డిస్‌ప్లే
- 4GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+5MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 13MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఫాస్ట్ ఛార్జింగ్
కనెక్టివిటీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5G, 4G VoLTE, బ్లూటూత్ v5.3, GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
అయితే, ఈ Samsung Galaxy M15 5Gధరను, దీని లభ్యత వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కొన్ని పరిమిత మార్కెట్లలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.