Mumbai, OCT 09: ఎస్‌బీఐ కార్డ్ (SBI Credit Card) తమ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ నియమాలలో రెండు పెద్ద మార్పులను చేసింది. నేటి కాలంలో క్రెడిట్ కార్డ్ వినియోగం ఎక్కువైంది. చాలా మంది ఇప్పుడు విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులను కూడా క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లిస్తున్నారు. అయితే మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నయితే ఇది త్వరలో కొంచెం ఖరీదైనది కావచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ (SBI Credit card rules) ద్వారా యుటిలిటీ బిల్లు (Utility Bill) చెల్లించడం కొంతమంది కస్టమర్లకు ఖరీదైనదిగా మారనుంది. డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 50 వేల కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లును చెల్లిస్తే దానిపై 1 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది.
Big Change In UPI: యూపీఐ లిమిట్ పెంపు, ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో మరిన్ని కీలక నిర్ణయాలు
యుటిలిటీ బిల్లు రూ. 50,000 కంటే తక్కువగా ఉంటే దానిపై ఎటువంటి అదనపు ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. శౌర్య/డిఫెన్స్ క్రెడిట్ కార్డ్ మినహా అన్ని అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌ల ఫైనాన్స్ ఛార్జీలో కూడా ఎస్‌బీఐ కార్డ్ కొన్ని మార్పులు చేసింది. ఆయా కార్డులపై 3.75 శాతం ఫైనాన్స్ ఛార్జీ విధించనుంది. ఈ మార్పు నవంబర్ 1 నుండి అమలులోకి రానుంది. ఇక్కడ అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌లు అంటే ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేదా పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం లేనివి.