SBI (Photo Credits: PTI)

Mumbai, May 28: ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్‌కు గట్టి షాక్ తగిలింది. క్రెడిట్ కార్డు (SBI Credit card) రద్దు చేసుకున్న తర్వాత బిల్లు చెల్లించాలని ఒక వ్యక్తిని ఆదేశించినందుకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్జూమర్ ఫోరం రూ.2 లక్షల పెనాల్టీ విధించింది. అతది కార్డు గడువు పూర్తయిన తర్వాత చార్జీలు చెల్లించలేదని బిల్లు పంపిన ఎస్బీఐ కార్డ్స్.. ఆయన ఖాతాను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. సర్వీసుల్లో లోపానికి మాజీ జర్నలిస్టు ఎంజే ఆంథోనీకి రూ.2 లక్షలు చెల్లించాలని న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్జూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెస్సల్ ఫోరం అధ్యక్షుడు మోనికా ఏ శ్రీవాత్సవ, సభ్యులు కిరణ్ కౌశల్, ఉమేశ్ కుమార్‌లతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. దాదాపుగా 20 ఏండ్లుగా బ్యాంకుల్లో రెగ్యులర్ ఖాతాలు నిర్వహిస్తున్న ఎంజే ఆంథోనీపై ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ముద్ర వేసింది ఎస్బీఐ కార్డ్. ఈ మేరకు ఆర్బీఐ ఆధ్వర్యంలో పని చేస్తున్న సిబిల్ డేటా బేస్‌లో (CIBEL) ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ఎంజే ఆంథోనీ పేరు చేర్చింది. దీంతో ఇతర బ్యాంకులో క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. సిబిల్ డేటా బేస్‌లో ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా తన పేరు చేర్చడం వల్ల తనకు రుణ పరపతి లభించలేదని ఎంజే ఆంథోనీ ఆరోపించారు.

Daam Virus: ఆండ్రాయిడ్‌ ఫోన్లను టార్గెట్‌ చేస్తున్న కొత్త వైరస్‌, కాల్ రికార్డులు, బ్రౌజింగ్ హిస్టరీని దొంగిలిస్తున్న వైరస్‌, మీకు తెలియకుండానే మొబైల్ పాస్‌వర్డ్‌లను కూడా మార్చేస్తుందంటున్న నిపుణులు 

ఈ నేపథ్యంలో ఎంజే ఆంథోనీ.. న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్జూమర్ ఫోరంను ఆశ్రయించారు. దీనిపై విచారించిన ఫోరం.. ఫిర్యాదు దారుడికి అనవసర నష్టం కలిగించినందుకు ఎస్బీఐ కార్డు పెనాల్టీ విధించింది. తమ ఆదేశాలు జారీ అయిన రెండు నెలల్లో రూ.2 లక్షల పరిహారం ఫిర్యాదుదారుడికి చెల్లించాలని వినియోగదారుల ఫోరం పేర్కొంది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.3 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.

Meta Layoffs: 6 వేల మంది ఉద్యోగులను తీసివేసిన ఫేస్‌బుక్ మెటా, ముందు ముందు లేఆప్స్ ఇంకా కొనసాగుతాయని తెలిపిన మెటా ఫౌండర్, CEO మార్క్ జుకర్‌బర్గ్ 

2016 ఏప్రిల్ తొమ్మిదో తేదీన నిబంధనలకు అనుగుణంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడటం నిలిపేసినట్లు ఎంజే ఆంథోనీ పేర్కొన్నారు.. ఆ సమయానికి క్రెడిట్ కార్డుపై బిల్లు బకాయిలు లేవని తెలిపారు. కానీ అదే ఏడాది సెప్టెంబర్ నెలలో ఆయన కార్డును రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ కార్డ్స్ లేఖ పంపింది. పలు సార్లు ఈ-మెయిల్స్ ద్వారా నిరసన తెలిపినా ఎస్బీఐ కార్డ్స్ బిల్లులు పంపుతూనే ఉన్నది.

2017 మే 18 నాటికి లేట్ పేమెంట్ ఫీజు, ఫెనాల్టీలతో కలిపి రూ.2946 చెల్లించాలని ఆయనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు (SBI) లెటర్ రాసింది. అంతేకాదు రుణం చెల్లింపులో విఫలమైనందుకు క్రెడిట్ హిస్టరీపై ప్రతికూల ప్రభావం పడుతుందని, భవిష్యత్‌లో రుణ పరపతి పొందడం మరింత కష్టం అవుతుందని తనకు ఎస్బీఐ కార్డు తెలిపిందని ఆయన పేర్కొన్నట్లు పీటీఐ వర్గాలు తెలిపాయి. అయితే, ఎంజే ఆంథోనీ వాదనను ఎస్బీఐ కార్డ్స్ తోసిపుచ్చింది. తనకు నష్టం కలిగించినందుకు పరిహారం చెల్లించాలని ఆంథోనీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన వినియోగదారుల ఫోరం.. ఈ నెల 20న ఆదేశాలు జారీ చేసింది.