సూర్యుడిపై అధ్యయనమే లక్ష్యంగా ఇటివలే ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను ట్విటర్ వేదికగా పంచుకుంది. ఆదిత్య-ఎల్1 (Aditya-L1 Mission) శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని వెల్లడించింది. ఈ సంబంధించి ఓ ట్వీట్ చేసింది. ‘‘ఆదిత్య-ఎల్1 (Aditya-L1 Mission) శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టింది. మిషన్‌లోని స్టెప్స్ (STEPS) పరికరానికి అమర్చిన సెన్సార్లు భూమికి 50 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే సప్రా-థర్మల్, ఎనర్జిటిక్ ఐయాన్స్, ఎలక్ట్రాన్స్‌ను కొలవడాన్ని ఆరంభించాయి. భూమి చుట్టూ ఉండే కణాల ప్రవర్తనను విశ్లేషించడంలో ఈ డేటా దోహదపడుతుంది. యూనిట్లలోని ఒక దాని ద్వారా సేకరించిన డేటా శక్తివంతమైన కణాల పర్యావరణంలో వైవిధ్యాలను ప్రదర్శిస్తుంది’’ అని ఇస్రో తన ట్వీట్‌లో పేర్కొంది.

Here's ISRO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)