చందమామ చేతికందే తరుణం మరెంతో దూరం లేదు. అన్ని మైలురాళ్ళను దాటుకుంటూ చంద్రయాణ్ 2 ప్రయాణం లక్ష్యం దిశగా విజయవంతంగా అనుకున్న సమయం ప్రకారం సాగుతుంది. గతవారం ఆగష్టు 14న భూకక్ష్యను వీడిన వ్యోమనౌక చంద్రుడి కక్ష్యవైపు విజయవంతంగా ప్రవేశపెట్టబడిన విషయం తెలిసిందే. నేడు అనుకున్న సమయం ప్రకారమే చంద్రుడి కక్ష్యలోకి వచ్చేసింది. శ్రీహరికోట నుంచి రాకెట్ ప్రయోగించిన 29 రోజులకు చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాణ్ 2 చేరుకుంది.
ముందుగా నిర్ధేషించిన ప్రకారం ఈరోజు ఆగష్టు 20, మంగళవారం ఉదయం 9:02 సమయంలో చంద్రయాణ్ 2 లో అత్యంత కీలకఘట్టమైన వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలో తీసుకొచ్చే ప్రక్రియ (LOI -Lunar Orbit Insertion)ను విజయవంతంగా పూర్తి చేశామని ఇస్రో ప్రకటించింది.
అలాగే సెప్టెంబర్ 7న చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసే వీలుగా మార్క్ III-ఎం1 శాటిలైట్ వెహికిల్ ను 90 డిగ్రీల కోణంలోకి కూడా తీసుకురావటాన్ని కూడా సాధ్యం చేశామని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక చంద్రుడికి చేరువయ్యే కొద్దీ వ్యోమనౌక కక్ష్యను 100X100 KM కక్ష్య నుంచి దశల వారీగా 100X30 KM కక్ష్యలోకి తగ్గించేలా నాలుగు ప్రక్రియలు చేపట్టాల్సి ఉంటుంది. ఆగష్టు 21, ఆగష్టు 28, ఆగష్టు 30 మరియు సెప్టెంబర్ 1వ తేదీలలో వరుసగా ఈ కక్ష్యను తగ్గించే ప్రక్రియలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Today (August 20, 2019) after the Lunar Orbit Insertion (LOI), #Chandrayaan2 is now in Lunar orbit. Lander Vikram will soft land on Moon on September 7, 2019 pic.twitter.com/6mS84pP6RD
— ISRO (@isro) August 20, 2019
అనుకున్నది అనుకున్నట్లుగా అని దశలను పూర్తిచేసి, సెప్టెంబర్ 7న ఉదయం 1:55 సమయంలో చంద్రయాణ్ 2 మిషన్ ను చంద్రుడిపై ల్యాండ్ చేయబోతున్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలియజేశారు.