Newdelhi, Apr 7: ఏ చిన్న గాయమైనా ముందుగా బ్యాండేజీ (Bandage) వేస్తాం. అయితే, గాయాలు (Wound) తగ్గడం కోసం ఉపయోగించే ఈ బ్యాండేజీల వల్ల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్నదని తేలింది. ఈ మేరకు హెల్త్ వెబ్ సైట్ మమవేషన్, ఎన్విరాన్‌మెంట్, హెల్త్ న్యూస్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పాలీఫ్లూరో ఆల్కైల్ సబ్‌స్టాన్సెస్ (పీఎఫ్‌ఏఎస్) అనే రసాయనాలు బ్యాండేజీలో ఉన్నట్టు తాము గుర్తించామని, వాతావరణంలో కరగనటువంటి ఈ కెమికల్స్ తో ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నట్టు అధ్యయనకారులు వివరించారు.
Evidence of Dangerous 'Forever Chemicals' Found in Bandageshttps://t.co/rT2gIlth0L
— TIME Health (@TIMEHealth) April 5, 2024
ఏయే రోగాలొస్తాయంటే?
శరీరంలో కలిసిపోకుండా అలాగే ఉండిపోయే పీఎఫ్‌ఏఎస్ రసాయనాలు మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. ఇన్ఫెక్షన్లపై పోరాడే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. వ్యాక్సిన్లు ఇచ్చే ఫలితాలను తగ్గిస్తాయి. సంతానోత్పత్తి సమస్యలకు దారి తీయవచ్చు. కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా సంబంధం ఉందని మరికొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. వాటర్ ప్రూఫ్ లక్షణాలు ఉండటం వల్లే పీఎఫ్‌ఏఎస్ రసాయనాలను బ్యాండేజీలో వాడుతున్నట్టు సమాచారం. భారత్ లో ఎక్కువగా అమ్ముడుబోయే బ్యాండ్-ఎయిడ్, క్యూర్ యాడ్ బ్రాండ్లకు చెందిన బ్యాండేజీల్లోనూ పీఎఫ్‌ఏఎస్ రసాయనాలు వాడుతున్నట్టు అధ్యయనం వెల్లడించింది.