Anand Mahindra on Chandrayaan-3 (Photo-Twitter and Blur)

చందమామను చేరుకున్న భారతావనిపై యావత్‌ ప్రపంచం అభినందనల వర్షం కురిపిస్తోంది. అయితే ఇస్రో (ISRO) చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగంపై ఓ అంతర్జాతీయ మీడియా ఛానెల్‌ చర్చా కార్యక్రమం చేపట్టింది. అందులో భారత్ గురించి యాకంర్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ధీటుగా బదులిచ్చారు. వలస పాలన ఫలితంగానే భారత్‌ పేదరికంలో ఉందన్నారు.

చంద్రయాన్‌-3 విజయం తర్వాత ఓ అంతర్జాతీయ మీడియా ఛానెల్‌లో యాంకర్‌ ‘‘చాలా మంది దీని గురించి ఆలోచిస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నా.. భారత్‌లో ఎంతో మంది ఇంకా పేదరికంలో ఉన్నారు. అలాగే, మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఆ దేశం ఇంకా వెనుకంజలోనే ఉంది. సుమారు 70కోట్ల మంది భారతీయులకు మరుగుదొడ్లు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసి భారత్‌ అంతరిక్ష పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందా?’’ అని చర్చలో పాల్గొన్న వ్యక్తిని ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఆనంద్‌ మహీంద్రా స్పందించారు.

విక్రమ్‌ ల్యాండ్‌ అయిన 4 గంటల తర్వాత బయటకు వచ్చిన ప్రగ్యాన్‌ రోవర్‌, 14 రోజుల పాటు 1,640 అడుగులు వరకు చంద్రునిపై ప్రయాణం చేయనున్న రోవర్

‘‘మీరు చెబుతున్న పేదరికం.. వలస పాలనలో వందల ఏళ్లు భారత వనరులను ప్రణాళికా బద్ధంగా దోచుకున్న దానికి ఫలితం. మా నుంచి విలువైన కోహినూర్‌ డైమండ్‌తోపాటు మా శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని కూడా దోచుకున్నారు. వలసపాలన ముఖ్య ఉద్దేశం సంపదను దోచుకోవడం మాత్రమే కాదు.. దేశ ప్రజలను ఆత్మన్యూనతకు గురిచేసి బాధితులుగా మార్చడం. ఇప్పుడు మీరు టాయిలెట్లు, అంతరిక్ష పరిశోధనలపై పెట్టుబడులను ప్రశ్నించడం ఈ వైఖరికి భిన్నమైందేమీ కాదు.

Here's Mahindra Tweet

మేం చంద్రుడిపైకి చేరుకోవడం మా దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుకోవడంతోపాటు మా ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది. విజ్ఞాన రంగంలో పురోగతిని సాధించేందుకు మాకు నమ్మకాన్ని కలిగిస్తుంది. అంతేకాదు పేదరికం నుంచి బయటపడాలనే ఆకాంక్షను ప్రేరేపిస్తుంది. అసలు పేదరికం ఏంటంటే ఆకాంక్షల్లో కూడా పేదరికాన్ని కలిగి ఉండటమే’’ అని మహీంద్రా బదులిచ్చారు. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చూసిన నెటిజన్లు ‘సరైన సమాధానం చెప్పారు’ అని కామెంట్లు చేస్తున్నారు