Newdelhi, Oct 17: ఐఐటీ-మద్రాస్ (IIT Madras) పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు (Medical Camps) నిర్వహణలో ఎదురవుతున్న ఓ ప్రధాన సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. వైద్య పరికరాలను స్టెరిలైజ్ (క్రిమి రహితం) చేసేందుకు ఓ ప్రత్యేక పరికరాన్ని (Special Machine) అభివృద్ధి చేశారు. సౌర శక్తి వాడుకొని పని చేసే ఆవిరి ఆధారిత స్టెరిలైజ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పరికరాన్ని ఓ చోట నుంచి మరో చోటకు తరలించే వీలు ఉండటం మరో విశేషం. ఐఐటీ-మద్రాస్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్ ప్రొఫెసర్ సత్యం సుబ్యయ్య నేతృత్వంలో ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు.
SSC Exams: మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు.. ఈసారీ ఆరు పేపర్లకే ఎగ్జామ్స్
సులువుగా స్టెరిలైజేషన్…
నీరు, విద్యుత్తు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించేటప్పుడు శస్త్రచికిత్సకు వినియోగించిన వైద్య పరికరాల స్టెరిలైజేషన్ సవాలుగా మారుతున్నది. స్టెరిలైజేషన్ సులువుగా మారితే ఎక్కువ మందికి సేవలు అందించే వీలు కలుగుతుంది.