భారత స్పేస్ స్టేషన్ ప్రాథమిక వెర్షన్ 2028లో నింగిలోకి వెళుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ (ISRO Chief S Somanath) తెలిపారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గురువారం జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కార్యక్రమం సందర్భంగా సోమనాథ్ మాట్లాడారు. భారత్ స్పేస్ స్టేషన్‌కు (India Working Towards Building Own Space Station) సంబంధించి వచ్చే ఏడాదికల్లా తొలి రౌండ్ పరీక్షలు నిర్వహిస్తాం. స్పేస్ స్టేషన్ బేసిక్ మోడల్‌ను 2028లో కక్ష్యలోకి పంపి 2035కల్లా దానికి పూర్తిస్థాయి రూపు తీసుకువస్తాం.
స్పేస్ స్టేషన్ క్రూ కమాండ్ మాడ్యూల్, నివాస మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్, డాకింగ్ పోర్ట్ అనే విభాగాలు కలిగి ఉంటుంది. ఈ మొత్తం స్టేషన్ 25 టన్నుల బరువు ఉంటుంది. అవసరమైతే తర్వాత దీనిని విస్తరిస్తాం. స్పేస్ స్టేషన్ ద్వారా మైక్రో గ్రావిటీ పరిశోధనలు చేస్తాం’ అని సోమనాథ్ తెలిపారు. కాగా, ఇప్పటివరకు నింగిలో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్) మాత్రమే ఉంది.