Newdelhi, Feb 17: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఏపీలో శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్14 రాకెట్ నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. జీఎస్‌ఎల్వీ రాకెట్ 2,275 కిలోల బరువు గల ఇన్సాట్-3డీఎస్ (INSAT-3DS) ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది.
ISRO आज ‘नॉटी ब्वॉय’ रॉकेट को करेगा लॉन्च, मौसम और आपदाओं से जुड़ी सटीक जानकारी देगा INSAT-3DS#IRO #INSAT3DS #BharatExpresshttps://t.co/VzjtDAg8jI
— Bharat Express (@BhaaratExpress) February 17, 2024
ప్రయోజనాలు ఏమిటి?
ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది.