Lunar Eclipse 2022

నేడు యాధృచ్చికంగా ఒకేసారి చంద్రగ్రహణం, బుద్ధ పూర్ణిమ వచ్చాయి. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం (Lunar Eclipse 2022) మే 16న ఏర్పడగా... అదే రోజు బుద్ధ పూర్ణిమ కూడా వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు ఉదయం 7.02గం. నుంచి మధ్యాహ్నం 12.20 గం. మధ్య చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడింది. అయితే ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించలేదు.

అయితే హిందువుల విశ్వాసం ప్రకారం.. చంద్రగ్రహణం రోజున ఎటువంటి శుభకార్యాలు పెట్టుకోరు. చంద్రగ్రహణం రోజున కొంత చెడు ప్రభావం కూడా వెంటాడుతుందని నమ్ముతారు. అయితే చెడు ప్రభావం వెంటాడకుండా ఉండేందుకు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిష్కార మార్గాలు సూచించబడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... ఈ 7 నియమాలు పాటిస్తే మీపై ఎటువంటి గ్రహణం దుష్ప్రభావాలు ఉండవని జ్యోతిష్యులు చెబుతున్నారు.

చంద్ర గ్రహణం, ఈ 5 రాశుల వారికి రేపటి నుంచి అంతా శుభం, పట్టిందల్లా బంగారమే, ధన యోగం, వివాహం, వాహనం దక్కుతాయి

చంద్రగ్రహణం సమయంలో గురు మంత్రాన్ని జపిస్తే మంచిదని విశ్వసిస్తారు. గురు మంత్రం 'ఓం గ్రాన్ గ్రీన్ గ్రున్స్: గురవే నమః' ఈ మంత్రాన్ని జపించడం శుభ ఫలితాలను ఇస్తుంది. చంద్రగ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించాలి. ఇలా చేయడం వల్ల వ్యాధులు దూరమవుతాయి. చంద్రగ్రహణం సమయంలో తులసి ఆకును నోట్లో పెట్టుకోవాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల గ్రహణ దుష్ఫలితాలు దూరమవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం ప్రారంభమయ్యే ముందు, తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత దానధర్మాలు చేయాలి.

చంద్రగ్రహణం..ఈ నాలుగు రాశులు వారికి ఈ ఏడాది తిరుగే ఉండదు, వ్యాపార,ఉద్యోగ, ఆదాయ మార్గాల్లో అంతా బంగారమే, బ్లడ్ మూన్‌పై ప్రత్యేక కథనం

చంద్రగ్రహణం సమయంలో గాయత్రీ మంత్రాన్ని పఠించడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి.చంద్రగ్రహణం సమయంలో లక్ష్మీదేవిని ధ్యానించడం కూడా శుభకరమని చెబుతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తుంది. శని అర్ధశతకాల ప్రభావం ఉన్నవారు గ్రహణ సమయంలో శని మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది.