New Delhi, December 26: భారీ గ్రహశకలం భూమికి(Earth) అత్యంత సమీపంగా వెళ్లనున్నది. నేడు ఆ గ్రహశకలం (asteroid)భూ కక్ష్యకు దగ్గర నుంచి వెళ్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఆస్టరాయిడ్‌ను 2000 సీహెచ్59గా(2000 CH59)) గుర్తించారు. ఆ గ్రహశకలం సుమారుగా 2034 అడుగుల వెడల్పు(2,034-foot asteroid) ఉన్నది.
ఇది సుమారు 27 వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది ఎంత వేగంతో వెళ్తోందంటే.. ఎఫ్-16 యుద్ధ విమానాల కన్నా 18 రేట్ల వేగంతో ఆ గ్రహశకలం ప్రయాణిస్తుంది. డిసెంబర్ 26వ తేదీన ఉదయం 7.54 నిమిషాలకు ఈ ఆస్టరాయిడ్ భూ కక్ష్యకు సమీపం నుంచి వెళ్లనున్నది.
సీహెచ్59 ఆస్టరాయిడ్ భూమికి దాదాపు 45 లక్షల మైళ్ల దూరంలో, చంద్రుడికి 19 రేట్లు ఎక్కువ దూరం నుంచి ఆ ఆస్టరాయిడ్ వెళ్తుందని నాసాకు చెందిన సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్(space agency's Center for Near Earth Object Studies (CNEOS)) పేర్కొన్నది. వాస్తవానికి సీహెచ్59 ఆస్టరాయిడ్ అత్యంత ప్రమాదకరమైన గ్రహశకలం. కానీ దాని వల్ల మాత్రం ప్రస్తుతం ఎటువంటి ముప్పులేదని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు.
అది ప్రయాణిస్తున్న మార్గాన్ని గమనిస్తే, కనీసం మరో వందేళ్ల వరకు కూడా ఆ గ్రహశకలంతో భూమికి ఎటువంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. నాసాకు చెందిన సీఎన్ఈవోఎస్ సంస్థ దాదాపు 25వేల గ్రహశకలాలను ట్రాక్ చేస్తున్నది. అయితే భూమికి సమీపంగా ప్రయాణిస్తున్న ఆబ్జెక్ట్స్‌లో కేవలం 35 శాతం మాత్రమే ప్రమాదకరమైనవని శాస్త్రవేత్తలు అంటున్నారు.