Newdelhi, May 21: ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం (Plastic Usage) బాగా పెరిగిపోయింది. మానవుడి శరీరంలోని హృదయం, రక్తం, గర్భిణుల మావిలోకి చేరిన మైక్రోప్లాస్టిక్ (Micro Plastic) రేణువులు తాజాగా పురుషుడి సంతానోత్పత్తికి కీలకమైన వృషణాల్లోకీ (Testicles) చేరుకున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో పరిశోధకులు తెలిపారు. మగ కుక్కలు, పురుషులపై ఈ అధ్యయనం చేసినట్టు పేర్కొన్నారు. కుక్కలతో పోలిస్తే పురుషుల వృషణాల్లో మూడు రెట్లు ఎక్కువగా మైక్రోప్లాస్టిక్ ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు.
Microplastics found in every human testicle in study https://t.co/VURXr6KbHa
— Guardian Science (@guardianscience) May 20, 2024
సంతానోత్పత్తిపై ప్రభావం
మైక్రోప్లాస్టిక్ కారణంగా పురుష సంతానోత్పత్తిపై ప్రభావం చూపే ప్రమాదమున్నదని పరిశోధకుడు జియోజంగ్ యూ పేర్కొన్నారు. వృషణాల్లో 12 రకాల మైక్రోప్లాస్టిక్ రేణువులను కనుగొన్నామని.. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, బ్యాగ్స్ తయారీకి వాడే పాలీఇథైలీన్ (పీఈ), పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) కూడా ఇందులో ఉన్నట్టు వివరించారు.